Engineering Graduates not getting Jobs

కోడింగ్ రాని ఇంజనీర్ల గోడు – కాలం చెల్లిన ఇంజనీరింగ్ సిలబస్

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు పెనుతుఫానులా విరుచుకుపడుతుంటే భారతీయ విద్యావ్యవస్థ పాతకాలపు పాఠాలతో విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తోంది. లక్షల రూపాయలు పోసి కొన్న ఇంజనీరింగ్ పట్టాలు ఇప్పుడు నిరుద్యోగ పత్రాలుగా మారుతున్నాయి. నైపుణ్యం లేని చదువులతో లక్షలాది మంది యువత ఐటీ కంపెనీల గడప తొక్కలేక అల్లాడుతున్నారు. మార్కెట్ అవసరాలకు, విద్యాబోధనకు మధ్య ఉన్న భారీ అగాధం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే సవాలుగా మారింది. నైపుణ్యం లేని గ్రాడ్యుయేట్లుభారతదేశంలో ఏటా 15 లక్షల…

Read More
AI Vs Techies

అడ్డమీది కూలీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి – టెక్నాలజీ రంగంలో ఉబర్ తరహా బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ముసుగులో సామాన్యుడి కడుపు కొట్టేందుకు టెక్ ది’గ్గజ’ దొంగలు సిద్ధమయ్యారు. కంప్యూటర్ల మేధస్సు పెరిగితే మనిషికి విలువ పడిపోతుందా అన్న అనుమానం నిజమవుతోంది. ఏఐ వస్తోంది… అంతా మారిపోతుంది అంటూ భయపెడుతూ తెర వెనుక ఖర్చు తగ్గించుకునే నాటకానికి తెర లేపారు. ఇది సాంకేతికత తెచ్చిన వినాశనం కాదు.. కేవలం సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ శక్తులు ఆడుతున్న ఒక తెలివైన జూదం. లాభాల కోసమే ఉద్యోగ కోతలుటెక్ దిగ్గజాలు గెనెరేటివ్ ఏఐ…

Read More
ISB Workshop on AI Treatment to Patients

రోగి ప్రాణంతో ఏఐ జూదం – డేటా భద్రతపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: రోగి నాడి పట్టుకోవాల్సిన వైద్యుడి స్థానంలో యంత్రం కూర్చుంటే ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా వైద్య రంగంలోకి ఏఐ దూసుకువస్తోంది. ఇది రోగుల పాలిట వరమా లేక ప్రాణాంతక ముప్పా అనే చర్చ మొదలైంది. రోగుల అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ వ్యవస్థలు వాడుకోవడమే ఇప్పుడు అతిపెద్ద వివాదం. నైతిక పర్యవేక్షణ లేకపోతే మనిషి ప్రాణం యంత్రాల చేతిలో కీలుబొమ్మగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడి విచక్షణకు ఏఐ ప్రత్యామ్నాయం…

Read More
AI Vs Temples

ఏఐ ‘గోవిందా గోవిందా’ – కృత్రిమ మేధకు అంతుపట్టని దేవుడు

సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ అడుగుపెట్టి ఉద్యోగాలను మింగేస్తున్న వేళ దేవాలయాల ప్రాంగణాలు మాత్రం భద్రమైన ఉపాధికి ఆశ్రయంగా మారుతున్నాయి. భక్తి, నమ్మకం అనేవి మనిషికి దేవుడికి మధ్య ఉండే అనుబంధం కాబట్టి ఇక్కడ మిషన్ల కన్నా మనుషుల అవసరమే ఎక్కువగా ఉంది. కాలక్రమేణా మారుతున్న పద్ధతులకు అనుగుణంగా ఇప్పుడు దేవాలయాల నిర్వహణలో వృత్తిపరమైన శిక్షణ, డిగ్రీలు అవసరమవుతున్నాయి. ఇదొక కొత్త కెరీర్‌గా మారుతోంది. యువత నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దాకా అందరూ ఈ…

Read More
Iran War with AI

ఏఐ మార్చిన యుద్ధ చరిత్ర – ఇరాన్ పై యుద్ధంలో మూడు ఏఐలే కీలకం

సహనం వందే, హైదరాబాద్: యుద్ధ రంగంలో మనిషి వేగాన్ని యంత్రం అధిగమించింది. గగనతలం నుంచి వచ్చే వేలాది నిఘా వీడియోలను విశ్లేషించడానికి గతంలో వందలాది మంది సైనికులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఏఐ కేవలం సెకన్లలోనే ఆ పనిని పూర్తి చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇదే జరిగింది. అగ్రరాజ్యం వాడిన అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు యుద్ధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కొన్ని గంటల్లో వేలాది లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం…

Read More
AI War

కృత్రిమ మేధ నేతల వధ – ఏఐతో రక్తపాతం… డ్రోన్లతో యుద్ధం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిఘా వ్యవస్థ ఇప్పుడు అణుబాంబు కంటే విధ్వంసకరంగా మారింది. ఒకప్పుడు కేవలం ఫోన్ ట్యాపింగ్‌కే పరిమితమైన నిఘా నేడు కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల సాయంతో నియంతల బెడ్రూంల వరకు చొచ్చుకెళ్లింది. కిలోమీటర్ల భూగర్భంలో దాక్కున్నా సరే వేలాది మైళ్ల దూరంలోని వైట్ హౌస్ నుండి శత్రువు గుండెపై గురిపెట్టగలిగేలా ఈ డిజిటల్ నెట్‌వర్క్ విస్తరించింది. ఇది కేవలం గూఢచర్యం కాదు.. ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసిస్తున్న ఒక అదృశ్య సాంకేతిక…

Read More
Sunder Pichai speech at AI Summit

పేదరికానికి ఏఐ మందు – గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్ఠీకరణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ కేవలం కొందరికే సొంతం కాకూడదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత సాయంతో పేదరికాన్ని జయించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. డిజిటల్ డివైడ్ కాస్తా ఏఐ డివైడ్‌గా మారకూడదనేది ఆయన ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ అందరికీ సమానంగా అందకపోతే ప్రపంచంలో అసమానతలు మరింత పెరుగుతాయని పిచాయ్ కుండబద్దలు కొట్టారు. టెక్నాలజీ అంటే కేవలం ధనవంతుల…

Read More
Smartphones to Wearables

ఫోన్ లేని కొత్త లోకం… స్క్రీన్లు లేని స్మార్ట్ యుగం

(బొల్లోజు రవి, హైదరాబాద్) మనం రోజుకు సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నాం. ఈ వ్యసనం నుండి బయటపడేయడమే లక్ష్యంగా సిలికాన్ వ్యాలీ స్క్రీన్ లెస్ విప్లవానికి తెరలేపింది. చేతిలో ఫోన్ పట్టుకుని నిరంతరం తలవంచుకుని తిరిగే కాలం ముగియనుంది. కళ్లద్దాలు, ఉంగరాలు, ఎయిర్‌పాడ్స్ ద్వారానే ఏఐ మన పనులన్నీ చక్కబెట్టే రోజులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ల నుండి విముక్తి…సామ్ ఆల్ట్‌మాన్ అభివృద్ధి చేస్తున్న ఏఐ పరికరం ఫోన్ల రద్దీ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో…

Read More
Techie turns to Poet - AI

ఏఐ ముప్పు… కవితే కనువిప్పు – కవిగా మారిన టెక్ మేధావి మృణాంక్ శర్మ

సహనం వందే, లండన్: ప్రపంచం వినాశనం అంచున ఉందంటూ ఒక మేధావి బాంబు పేల్చారు. అగ్రశ్రేణి ఏఐ సంస్థ ఆంత్రోపిక్ కీలక పరిశోధకుడు మృణాంక్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. కోట్లాది రూపాయల జీతాన్ని వదిలేసి కవిత్వం రాయడానికి బ్రిటన్ వెళ్తున్నారు. యంత్రాల వేగం పెరిగి మనిషి విజ్ఞత తగ్గుతోందని ఆయన ఆవేదన చెందారు. టెక్నాలజీ ప్రపంచంలో ఈ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ముప్పులో ముల్లోకాలుబ్రిటన్‌కు చెందిన మృణాంక్ శర్మ అమెరికాలో ఆంత్రోపిక్…

Read More
AI waste - Stanford University

సొంత తెలివే అసలైన ఆస్తి – ఏఐతో మెదడు మొద్దుబారు

సహనం వందే, హైదరాబాద్: డిగ్రీ చేతికి రావాలంటే కంప్యూటర్ ముందు కూర్చుని చాట్ జీపీటీని అడిగితే చాలు. అసైన్మెంట్లు నుంచి ప్రాజెక్టుల వరకు అన్నీ నిమిషాల్లో సిద్ధం. కానీ ఈ సులభమైన దారి తన మేధస్సును మొద్దుబారుస్తుందని ఆ విద్యార్థిని గుర్తించింది. ప్రపంచం అంతా కృత్రిమ మేధ వెంట పరుగులు తీస్తుంటే ఆమె మాత్రం తన సొంత ఆలోచనలకే పదును పెట్టింది. ఆ విజ్ఞాన ప్రయాణమే ఈ కథనం. సులభమైన దారి వద్దే వద్దుస్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంటే…

Read More
AI Medication - Chatbots

ఏఐ వైద్యం… చావు తథ్యం – డాక్టర్ల కంటే చాట్ బాట్లపైనే నమ్మకం

సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగంలోకి చొరబడుతున్న ఏఐ ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతోంది. గూగుల్ తల్లి కంటే ఘోరంగా ఏఐ చాట్ బాట్లు ఇచ్చే సలహాలు రోగులను చావు అంచున నిలబెడుతున్నాయి. చిన్నపాటి దగ్గును కూడా క్యాన్సర్ అని చెప్పి భయపెడుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణ లేని ఈ టెక్నాలజీ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఐదేళ్లలో చనిపోతావని భయం…ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఏఐ దారుణాలకు అద్దం పడుతోంది. కాలికి క్యాన్సర్ గడ్డ…

Read More
AI Love

ప్రేమ కోసం ఏఐ పరితాపం – మనిషితో డేటింగుకు రోబో ఆరాటం

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ సామ్రాజ్యం ఇప్పుడు మీ బెడ్ రూమ్ దాకా వచ్చేసింది. రోబోలకు అన్నీ ఉన్నాయి కానీ మనిషి ఇచ్చే వెచ్చని స్పర్శ లేదు. అందుకే ఇప్పుడు రెంటా హ్యూమన్ పేరుతో మనిషి శరీరాన్ని అద్దెకు తీసుకుంటున్నాయి. ఇది కేవలం పని కోసం కాదు… ముద్దు, కౌగిలింత, చివరకు శృంగారం వంటి అత్యంత సున్నితమైన అనుభూతులను డిజిటలైజ్ చేయడానికి సాగుతున్న మాయాజాలం. మనిషిని ఒక పరికరంగా మార్చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది….

Read More
AI Agents - Malt Book

మనపై చాడీలు చెప్పే ‘ఏఐ’ – ఏఐ బాట్లకు సొంత సోషల్ మీడియా అడ్డా

సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో ఒకచోట చేరి తమ యజమానుల గురించి ఎలా సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటారో ఈ బాట్లు కూడా మాల్ట్ బుక్ లో తమ యజమానుల గురించి, వారి పనుల గురించి మాట్లాడుకుంటాయి. అయితే ఈ వెబ్ సైట్ లో భద్రత లేకపోవడంతో…

Read More
Alfa zee Nome - Google Deep Mind

బ్రహ్మరాత ‘ఏఐ’ తిరగరాత – ఆల్ఫా జీనోమ్ ఏఐ టెక్నాలజీ అద్భుతం

సహనం వందే, న్యూఢిల్లీ: మన శరీరం ఎలా ఉండాలి, మనకు ఏ వ్యాధులు వస్తాయి అనేది మన కణాల్లో ఉండే ‘డీఎన్ఏ’ నిర్ణయిస్తుంది. ఇది మన శరీరానికి సంబంధించిన ఒక పెద్ద ‘గైడ్ బుక్’ లాంటిది. ఈ పుస్తకంలో ఏవైనా తప్పులు ఉంటే మనకు జబ్బులు వస్తాయి. ఈ పుస్తకాన్ని చదివి, అందులో ఎక్కడ తప్పు ఉందో కనిపెట్టే ‘ఆల్ఫా జీనోమ్’ అనే కొత్త టెక్నాలజీని గూగుల్ డీప్‌మైండ్ కనిపెట్టింది. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద…

Read More
AI Bubble

ఏఐ బుడగ… ఇన్వెస్టర్ల గుండె దడ – గాలి బుడగలా ఏఐ మార్కెట్

సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) మాటే వినిపిస్తోంది. అయితే ఈ ఏఐ అనేది ఒక పెద్ద గాలి బుడగ అని… అది ఎప్పుడైనా పేలవచ్చని ఆర్థిక నిపుణుడు ఎరిక్ గార్డన్ బాంబు పేల్చారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోవడమే దీనికి నిదర్శనమని ఆయన హెచ్చరిస్తున్నారు. ఏఐ వల్ల ప్రపంచం మారిపోతుందని ఆశపడి వేల కోట్లు కుమ్మరిస్తున్న ఇన్వెస్టర్లకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది….

Read More
Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
AI Dolls to Elderly People

అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ…

Read More

ఏఐని నమ్మితే నట్టేటే – సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్

సహనం వందే, అమెరికా:ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తుంటే… గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ మాత్రం దాన్ని అంతగా నమ్మొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. ‘ఏఐ అందించే సమాచారాన్ని కళ్లు మూసుకుని నమ్మొద్దు’ అని ఆయన వినియోగదారులకు సూచించడంపై టెక్నాలజీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ తప్పులు చేస్తున్నాయని… వాటిని కేవలం ఒక సమాచార వనరుగా మాత్రమే పరిగణించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐపైనే…

Read More

నేతల లూటీ… ఏఐ లాఠీ – రాజకీయ అవినీతిని వెలికితీసేలా కొత్త ఫీచర్

సహనం వందే, హైదరాబాద్:దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు….

Read More

ఏఐ చాట్… స్మశానానికి రూట్ – మెంటలెక్కిస్తున్న చాట్‌జీపీటీ

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా కనిపించే ఏఐ చాట్‌బాట్లు ఇప్పుడు వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌జీపీటీని తయారుచేసిన ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా బయటపెట్టిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ వినియోగదారులలో వారానికి దాదాపు 0.07 శాతం మంది పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు గురవుతున్నారని సంస్థ వెల్లడించింది. ఈ శాతం చిన్నదే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నందున… ఈ లెక్క లక్షల్లో…

Read More

ఏఐ సైకోసిస్ – దాంతోనే ఒంటరిగా గడిపితే భ్రమల్లో జీవితం

సహనం వందే, అమెరికా:కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి మానవాళికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏఐ పితామహుడిగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఏఐ పరిశోధన ఒక ఆయుధాల పోటీలా మారిందని, దీనిపై నియంత్రణ లేకపోతే అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విప్లవం ప్రపంచంలో పెను మార్పులు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్న కంపెనీలు…ఒకప్పుడు…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More