Revanth serious action on Oilpalm company Lohiya

రేవంత్ మార్క్… అదిరిపోయే స్ట్రోక్ – ఆయిల్ పామ్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు పెంచకుండా కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. ఇలాంటి సంస్థల పట్ల ఉదాసీనత పనికిరాదని భావించిన సర్కారు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. సాగులో పురోగతి చూపని కంపెనీల జోన్లను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

Read More
Poor People Houses

గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు

సహనం వందే, న్యూఢిల్లీ: అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి. రెట్టింపైన విధ్వంసం…గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో…

Read More
D Vitamin deficiency Dengue severe

డీ-లోపం… డెంగీ తీవ్రం – ఐసీఎంఆర్ పరిశోధనలో తేలిన చేదు నిజం

సహనం వందే, హైదరాబాద్: దోమ కాటుతో వచ్చే డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. కొందరిలో సాధారణ జ్వరంగా తగ్గిపోతుంటే మరికొందరిలో ఎందుకు తీవ్రమవుతోంది అన్నది మిస్టరీగా మారింది. దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో విటమిన్ డీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయన నివేదిక విస్తుపోయే అంశాలను వెల్లడించింది. ఆ నివేదికపై గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ‘సహనం వందే’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది….

Read More
Dr.Kiran Madala press Note

డాక్టర్ల డిమాండ్లపై కి’రణ్’ మాదల – వైద్య ఆరోగ్యశాఖ తీరుపై మండిపాటు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లు తమ డిమాండ్లపై రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. బకాయిల కోసం విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వైద్యుల గోడును పట్టించుకోని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందని ఎరియర్స్తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. యూజీసీ పీఆర్సీ బకాయిలు 2016 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం 2024లో జీవో…

Read More
10 Min delivery Workers Strike

డెలివరీలో ‘టైమ్ బాంబ్’ – 10 నిమిషాల ఫుడ్ సరఫరాతో ప్రాణాలకు ముప్పు

సహనం వందే, హైదరాబాద్: మన ఆకలి తీర్చే గిగ్ కార్మికులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొత్త ఏడాది వేడుకల వేళ తమ కష్టాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. కంపెనీల మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో సాగిస్తున్న మరణ మృదంగాన్ని అడ్డుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 10 నిమిషాల డేంజర్డెలివరీ యాప్స్ ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ అంటూ వింత ప్రయోగాలు చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ…

Read More
Digvijay Singh Vs Revanth Reddy

దిగ్విజయ్ సింగ్ వర్సెస్ రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీలో కాషాయ మంటలు

సహనం వందే, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు. దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్…

Read More
Maoist

మావోయిజంలో ఎండమావులు – తుపాకీ గొట్టంతోనే మార్పు అంటూ స్లో’గన్’

సహనం వందే, హైదరాబాద్: అడవి బాట పడితే అద్భుతాలు జరుగుతాయని కొందరు నమ్ముతారు. తుపాకీ పడితేనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల అనుభవాల ద్వారా వారి జీవితాల్లోని అసలు నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆదర్శాల ముసుగులో అన్యాయంమావోయిస్టు ఉద్యమం ఆరంభంలో గొప్ప ఆదర్శాలతో మొదలైంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడవి బాట పట్టారు. కానీ కాలక్రమేణా ఆ లక్ష్యాలు పక్కకు వెళ్లాయి. సాధారణ ప్రజలను రక్షించాల్సిన…

Read More
Delhi - Hyderabad - India capital Issue

ఢిల్లీకి గుడ్ బై… దక్షిణాదికి జై – రాజధాని హోదాపై రగులుతున్న కొత్త రచ్చ

సహనం వందే, బెంగళూరు: భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వైరల్ వార్.. రాజకీయ జోరుఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా…

Read More
Minorities issue

మతం.. మైనారిటీలు ఖతం – జాతీయ మైనారిటీల కమిషన్ వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగం చెబుతున్నా నేడు పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అధికారం అండతో పెచ్చరిల్లుతున్న రాజకీయ మతవాదం దేశ ఐక్యతను దెబ్బతీస్తోంది. ముస్లింలను శత్రువులుగా చూపిస్తూ… క్రిస్టియన్లను మత మార్పిడి దొంగలుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఈ హింసాకాండ వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పెరిగిన భయం…దేశంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మైనారిటీల కమిషన్ లెక్కల ప్రకారం 2024లో మొత్తం 1390 ఫిర్యాదులు వచ్చాయి….

Read More
Dhurandhar Movie not dubbing in Telugu

ధురంధర్ డబ్బింగ్‌కు టాలీవుడ్ అడ్డు – తెలుగు వెర్షన్ రాకుండా కుట్రలు కుతంత్రాలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ సినీ యవనికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ నామజపమే వినిపిస్తోంది. దేశభక్తి సెగను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆదిత్య ధర్ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. రణవీర్ సింగ్ తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. అయితే ఉత్తరాదిని ఊపేస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దూరం చేయడం వెనుక గూడుపుఠాణి జరుగుతోందన్న చర్చ మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ…రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. సినిమా నిడివి అంత…

Read More