24 గంటలు… 3 రాష్ట్రాలు… 5,742 కి.మీ. – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఘనత
సహనం వందే, విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు 24 గంటల్లో రికార్డ్ సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో 5,742 కిలోమీటర్ల విమాన ప్రయాణం చేసి పలు అభివృద్ధి, సేవా, పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ముంబై వెళ్లిన ఆయన అక్కడ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇండియన్ అథ్లెటిక్ జ్యోతి యర్రాజికి ఘన సత్కారం చేశారు. ఆ తర్వాత అదేరోజు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయమే లేచి 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ…