‘నంబర్ వన్‌’ భ్రమ – నెంబర్ కేవలం సమాజం సృష్టించినదే

సహనం వందే, హైదరాబాద్:ప్రతిచోటా నంబర్ వన్‌ గా ఉండాలి. ఉద్యోగంలో టాప్ ప్లేస్‌లో… ఇంట్లో అప్యాయమైన తల్లిగా… భార్యగా… ఇలా అన్ని పాత్రల్లో నూటికి నూరు శాతం అద్భుతంగా ఉండాలనే లక్షణం ఈ తరం మహిళలకు పెద్ద భారంగా మారింది. ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరి చివరికి ఏం చేస్తుందో తెలుసా? రచయిత్రి అమండా గోయెట్జ్ జీవితంలో జరిగిన విషాదమే ఉదాహరణ. అన్నింటా సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని పరుగులు తీసిన ఆమె… ఒక రోజు తీవ్రమైన…

Read More

రక్తం కోరిన రాజ్యం – సుడాన్‌ను గడగడలాడిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్

సహనం వందే, సుడాన్:సుడాన్‌ను గడగడలాడిస్తున్న పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) క్రూరత్వం మరోసారి ప్రపంచానికి బహిర్గతమైంది. గత నెలలో ఎల్‌-ఫాషర్ నగరంలో జరిగిన భయంకరమైన మారణకాండ వివరాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ దాడిలో 2 వేల మందికి పైగా పౌరులు చనిపోయి ఉండవచ్చని అంచనా. ‘చూడండి… ఇదే మా పని… ఇదే జెనోసైడ్’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు తొమ్మిది శవాల పక్కనుంచి వెళ్తూ ఉల్లాసంగా నవ్వుతూ వీడియోలు తీయడం వారి కర్కశత్వానికి పరాకాష్ట. యుద్ధ…

Read More

మా ‘కంత్రి’ కుటుంబం – మాగంటి మృతిపై అతని తల్లి సంచలనం

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె కుటుంబం నుంచే బిగ్ షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వంపై కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ ముసలం ముదిరి అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఉపఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే రెవెన్యూ అధికారుల విచారణకు ఈ వివాదం దారితీయడం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నింపుతోంది. మాగంటి కుటుంబంలోని ఈ కలహాల ప్రభావం ఈ…

Read More

‘జుకర్’ జూదం… లక్ష కోట్ల మోసం – ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మోసపు ప్రకటనలు

సహనం వందే, హైదరాబాద్:మెటా అధినేత జుకర్ బర్గ్ ప్రపంచాన్ని లూటీ చేస్తున్నాడు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్ మీడియాల్లో మోసపూరిత ప్రకటనలను అనుమతించడం ద్వారా ఏడాదికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు రహస్య నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ ప్రకటనలు నకిలీ ఇ-కామర్స్ పథకాలు, అక్రమ పెట్టుబడి స్కీములు, అక్రమ ఆన్‌లైన్ కేసినోలు, నిషేధిత వైద్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినవి. అత్యంత విశ్వసనీయ నివేదికల ప్రకారం… 2024 నాటికి మెటా తన మొత్తం వార్షిక ఆదాయంలో…

Read More

లెఫ్ట్ జోరు… రైట్ బేజారు – న్యూయార్క్ మేయర్ ఎన్నికలతో జోష్

సహనం వందే, యూరప్:అమెరికాలో… ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి పట్టుకొమ్మగా భావించే న్యూయార్క్ నగర మేయర్ రేసులో జోహ్రాన్ మామ్దాని విజయం సాధించడం ఐరోపా అంతటా లెఫ్ట్ వింగ్ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే ప్రజాస్వామ్య సోషలిస్ట్ గా ప్రకటించుకున్న మామ్దాని… అద్దెల నియంత్రణ, ధనవంతులపై పన్ను విధిస్తాననే వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించారు. ఆయన వాదనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ విజయం తమ దేశాలలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రైట్…

Read More

బీ’హోర్’లో కుబేరులు – వెయ్యి మంది అభ్యర్థులు కోటీశ్వరులే

సహనం వందే, బీహార్:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి డబ్బు, పేదరికం మధ్య భారీ అంతరాన్ని చూపించాయి. మొత్తం 243 స్థానాలకు 2,600 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… వీరి సగటు ఆస్తి విలువ 2020తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 2020 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.72 కోట్లు ఉండగా… 2025లో ఇది రూ. 3.35 కోట్లకు చేరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 42 శాతం (1081 మంది) కోటీశ్వరులే ఉండటం ఎన్నికల ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది….

Read More

‘దృశ్యం’ రివర్స్ – భార్య, ప్రియుడి క్రూరత్వం

సహనం వందే, అహ్మదాబాద్‌:దృశ్యం సినిమాను తలపించే అత్యంత క్రూరమైన హత్యోదంతం అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సరిగ్గా ఏడాది క్రితం అదృశ్యమైన 35 ఏళ్ల సమీర్ అన్సారీ అనే వ్యక్తి అస్థిపంజరం మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో బయటపడింది. అతడి ఇంటి కిచెన్ ఫ్లోర్ కింద శవం లభ్యమైంది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. వివాహేతర సంబంధంపై భర్త నిలదీయడంతో అతనిని అడ్డు తొలగించుకోవడానికి నిందితులు పక్కా…

Read More

బస్టాండ్‌ పై హెలిప్యాడ్‌ – 150 ప్లాట్‌ ఫారాలతోపాటు ఐమాక్స్‌

సహనం వందే, తిరుపతి:శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. వెంకన్న భక్తులు రోజుకు లక్షల్లో తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని తట్టుకునేలా 11 అంతస్తుల అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేవలం బస్సులు నిలిపే స్థలంగా కాకుండా దివ్యక్షేత్రానికి తగిన విధంగా ఆధునిక వసతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి అన్ని సౌకర్యాలతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఆశ్చర్యకరంగా…

Read More

భజన్ రాక్… ‘జెన్ జెడ్’ కిరాక్ – ఇండియాలో భక్తికి యువతరం మోడ్రన్ టచ్

సహనం వందే, ముంబై:యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్…

Read More

రోడ్లపై నరబలి – రహదారి ప్రమాదాల్లో సామూహిక ఊచకోత

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ రోడ్లు మరణం మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కేవలం యాక్సిడెంట్లుగా పరిగణించలేం. ఇవి వేగంగా వాహనాలు నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్లక్ష్యపు హత్యలే. ప్రతిరోజూ సగటున 420 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రోడ్ల మీద చనిపోయారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు…

Read More