నంబాల కేశవరావుకు ఎల్ టీటీఈ శిక్షణ

సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా…

Read More

రాగి బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు!

సహనం వందే, హైదరాబాద్: కాపర్ (రాగి) బాటిళ్లు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, అతిగా రాగిని తీసుకోవడం వల్ల ‘కాపర్ టాక్సిసిటీ’ సమస్య తలెత్తుతుంది. ఇది కిడ్నీలు, లివర్‌కు తీవ్రమైన హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు రాగి బాటిళ్లను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం… రాగి మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది…

Read More

ఎవడైతే నాకేంటి?

సహనం వందే, హైదరాబాద్: ఆయన రాష్ట్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి. జిల్లా వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. ఆ అధికారికి నోటి దురుసు ఎక్కువ. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు వైద్యాధికారులు హైదరాబాదులోని ఆ కీలక అధికారిని కలిశారు. తమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వైఖరితో విసిగిపోయామని, ఆయన్ను తొలగించాలని… అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంగీకారం తెలుపుతూ లేఖ రాశారని తమ బాస్ కు…

Read More

రీ-రిలీజులే దిక్కా?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పుడు కొత్త కథలు, సృజనాత్మకతతో ప్రేక్షకులను అలరించేది. కానీ ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు మంచి సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. థియేటర్ల సంఖ్య, స్క్రీన్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, కొత్త సినిమాల కొరతతో బోరు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పాత సినిమాలతో పాటు, సీనియర్ ఎన్టీఆర్ లాంటి లెజెండ్‌ల చిత్రాలైన మాయాబజార్ వంటివి…

Read More

‘సుప్రీం’పై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా… దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. ఈ చేదు నిజాన్ని చాటిచెప్పేలా ఇటీవలి కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఇది కేవలం సామాన్యుల సమస్య కాదని, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ కులం పేరుతో అవమానాలు తప్పడం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. భారత సమాజంలో కుల వివక్ష ఎంత…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

‘నకిలీ’ మాఫియా నీడలో వ్యవసాయశాఖ

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. రైతులు ఇప్పటికే విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలాగే దళారులు రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులు నిషేధిత బీటీ-3 విత్తనాల దందాతో మోసపోతున్నారు. వ్యాపారులు, దళారులు అధిక దిగుబడి, తెగుళ్ల నిరోధకత పేరుతో ఈ విత్తనాలను రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టడంలో విఫలమవుతూ, కొందరు దళారులతో కుమ్మక్కై చూసీ చూడనట్టు…

Read More

మహేశ్‌బాబు కుటుంబంలో కరోనా

సహనం వందే, హైదరాబాద్: కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో, భారతదేశంలో కూడా కరోనా తిరిగి ప్రవేశించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో ఈ వార్త కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ ద్వారా…

Read More