బహుజన హక్కుల బలిదానం – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చుక్కెదురు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బహుజన సమాజానికి విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి రంగాలలో సరైన అవకాశాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయన్న సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి బహుజనుల రాజ్యాంగ హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిణామం దేశంలోని…

Read More

కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం

సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…

Read More

ప్రజా’రోగ్’ కార్యాలయం – ప్రజారోగ్య విభాగంలో అధికారి హరి లీలలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రజారోగ్య కార్యాలయం అవినీతికి, లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందనేందుకు తాజా లీగల్ నోటీసు తిరుగులేని రుజువు. ఒక సీనియర్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అందులోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఫిర్యాదు చేయడం వైద్య ఆరోగ్య శాఖలో సంచలనం అయింది. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహ సహా ఉన్నతాధికారులకు లీగల్ నోటీసులు జారీ చేయడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. అవినీతి ఆరోపణలతో పాటు మహిళల వేధింపుల ఫిర్యాదులు నిత్యం…

Read More

మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

‘రియల్’ దూకుడు… దిమ్మతిరిగే ధరలు! – దేశంలో ఉరకలేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

సహనం వందే, హైదరాబాద్:దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ…

Read More

కరోనా విపత్తు… రెమెడెసివిర్ రాకెట్ – హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేసిన సమయంలో రెమెడెసివిర్ ఇంజెక్షన్ల చుట్టూ జరిగిన అవినీతి దారుణాలు ఇప్పటికీ ప్రజలను కలవరపరుస్తున్నాయి. అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను శాసించిన మాజీ మంత్రి హరీష్ రావును పాలనలో ఈ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతని నియంత్రణలో వైద్య వ్యవస్థ అవినీతి మయమైందని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ఈ దారుణాలను ఎండగడుతూ హరీష్ రావును నిలదీస్తోంది. మందుల సరఫరా నుంచి వ్యాక్సిన్ల…

Read More

విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కలల మాటున కన్నీళ్ల కథభారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా…

Read More

దేశదేశాన ‘జెన్ జెడ్’ ప్రభంజనం – ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది

సహనం వందే, న్యూఢిల్లీ:మొరాకో… మడగాస్కర్… పెరూ… నేపాల్… ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశ దేశాలకు జెన్ జెడ్ ఉద్యమం ప్రభంజనంలా వ్యాపిస్తుంది. జెన్ జెడ్ తరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది. అవినీతి, అసమానతలు, అణచివేతలపై ఈ తరం గట్టిగా నినదిస్తుంది. మొరాకోలో జెడ్212 ఉద్యమం విద్య, వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని బయటపెట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల…

Read More