
ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు
సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…