మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…

సహనం వందే, హైదరాబాద్:బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి….

Read More

విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

సహనం వందే, న్యూఢిల్లీ:విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే…

Read More

పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

‘పోష్ కాదు స్లేవ్స్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ…

Read More

దళితులపై దాష్టీకం హక్కుల ఉల్లంఘనే!

సహనం వందే, ఢిల్లీ: తెనాలిలో దళితులపై పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెనాలిలో ముగ్గురు దళితులను లాఠీలతో దారుణంగా హింసించి, బూటు కాలుతో తన్ని దాడి చేయడంపై హైదరాబాద్‌కు చెందిన హైకోర్ట్ న్యాయవాది సీలోజు శివకుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కమిషన్ సభ్యురాలు విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్…

Read More

దేశంలో మళ్లీ కరోనా అలజడి

సహనం వందే, ఢిల్లీ: అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. నిపుణుల హెచ్చరిక…భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ…

Read More