‘సాక్షి’లో కలకలం – కార్యాలయాల వద్ద ధర్నాలు

సహనం వందే, అమరావతి: సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఆ మీడియా సంస్థలో కలకలం చెలరేగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ సంస్థలోని జర్నలిస్టులు భయపడుతున్నారు. గత నెల సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు. విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇలా ఒకటి తర్వాత ఇంకొకటి సాక్షిలో కీలక వ్యక్తులు టార్గెట్ అవడంపై జర్నలిస్టులు కలవరపడుతున్నారు. ఏమి రాస్తే…

Read More

అమెరికన్ జెండాల దహనం -లాస్ ఏంజిల్స్‌లో నిరసన జ్వాలలు

44 మంది అరెస్ట్… ఉద్రిక్తత సహనం వందే, లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్ నగరంలో ఇమ్మిగ్రేషన్ రైడ్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పరామౌంట్ ప్రాంతంలో హిస్పానిక్ జనాభా అధికంగా ఉండే చోట ప్రదర్శనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, కొందరు మెక్సికన్ జెండాలను ఊపగా, మరికొందరు అమెరికన్ జెండాను తగలబెట్టారు. ఫెడరల్ భవనం వెలుపల నినాదాలు మార్మోగాయి. అరెస్టులు… ఘర్షణలుశుక్రవారం లాస్ ఏంజిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్…

Read More

అందం వెనుక విషాదం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం. 16 ఏళ్లలోనే జీవిత పాఠం…2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని…

Read More

థగ్ లైఫ్ ఒక మహత్తర చిత్రం:

ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్! సహనం వందే, విశాఖపట్నం: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది….

Read More

దళితులపై దాష్టీకం హక్కుల ఉల్లంఘనే!

సహనం వందే, ఢిల్లీ: తెనాలిలో దళితులపై పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెనాలిలో ముగ్గురు దళితులను లాఠీలతో దారుణంగా హింసించి, బూటు కాలుతో తన్ని దాడి చేయడంపై హైదరాబాద్‌కు చెందిన హైకోర్ట్ న్యాయవాది సీలోజు శివకుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కమిషన్ సభ్యురాలు విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్…

Read More

ఎంబీబీఎస్-ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ కోర్సు

సహనం వందే, హైదరాబాద్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ప్రాథమిక దశలో కోర్సు…ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త…

Read More

పవన్ తో పెట్టుకుంటే పతనమే

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగ్గుమంటున్నారు. తమ కూటమి ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవడం పైన… తన సినిమా విషయంలో అడ్డువస్తున్న వారిపట్ల ఆయన మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇతర సినీ పెద్దలపై కన్నెర చేశారు. పవన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని…

Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

Read More

మిస్ వరల్డ్ తారలను ఎవరు వేధించారు?

ప్రభుత్వం సమాధానం చెప్పాలని సబిత డిమాండ్ సహనం వందే, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ కామెంట్స్‌పై మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదివారం స్పందించారు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ పరువును ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. మ్యాగీ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రపంచ దేశాల యువతులను ఎవరు వేధించారో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరో తేల్చాలని… మహిళా కమిషన్ స్పందించి విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More

సినిమా థియేటర్ల వివాదంపై అల్లు…

సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్‌ మాత్రమే ఉందన్నారు. స్టాండ్‌ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.

Read More