60 Lakh Voters Risk in Telangana - Chief Election Commissioner

తెలంగాణలో 35 లక్షల ఓట్ల ఊచకోత? – ఓట్ల సవరణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఎన్నికల నగారా మోగకముందే ఓట్ల రాజకీయం ముదిరింది. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాయడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేలా సాగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రానుంది. తెలంగాణలో ఓట్ల వేట రాష్ట్ర పర్యటనలో ఉన్న…

Read More
ఒకే ప్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

కటౌట్ కిక్.. పాలిటిక్స్ షేక్ – ఒకే ఫ్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల పొత్తుల వైపు ఈ ఫ్లెక్సీ సంకేతాలు పంపుతోంది. పుట్టినరోజు వేళ కొత్త రచ్చ…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ…

Read More
Speaker Telangana

ఫిరాయింపుల కంపు రాజకీయం – పార్టీలు మారినా దొరకని ఆధారాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ముదిరి పాకాన పడింది. పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్ష్యాల వేటలో స్పీకర్ నాటకంగులాబీ గూడు వదిలి హస్తం నీడకు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తేల్చారు. కళ్లముందే పార్టీ కండువాలు మార్చుకున్నా సాక్ష్యాలు లేవనడం హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ…

Read More
Sisters/Women in Politics

వారసుడిదే పీఠం… ఆడబిడ్డ శోకం – రాజకీయ మంటల్లో ఆడకూతురు ఆగమాగం

సహనం వందే, హైదరాబాద్:రాజకీయ చదరంగంలో ఎప్పుడూ బలిపశువులు అయ్యేది ఆడబిడ్డ అనే చేదు నిజం మరోసారి బయటపడింది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయడమే కాదు అక్కడి అతిపెద్ద రాజకీయ కుటుంబమైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కూడా చిచ్చు రేపాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తే… ఆ ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి…

Read More

‘ఎగ్జిట్’ నాటకం… వెనుక కుతంత్రం – మాయాజాలం కాదు… మహా మోసం

సహనం వందే, హైదరాబాద్:ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠను అమాంతం పెంచే ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే తీర్పు కాదు. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన అంకెల జూదం. వీటి ఉద్దేశం.. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు తమ ఆర్థిక వ్యూహాలను అమలు చేసుకోవడమే. అంతేకాదు కౌంటింగ్‌కు ముందు తమ ప్రేక్షకులను, పాఠకులను నిలుపుకునేందుకు మీడియాకు పనికివస్తాయి. అందుకే దీనిని కేవలం ఉత్కంఠ కోసమే అనుకుంటే పొరపాటే. గోడ దూకే నాయకులకు…

Read More

జనం నెత్తిన వారసత్వం – కుటుంబాల గుప్పిట్లో ప్రజాస్వామ్యం

సహనం వందే, న్యూఢిల్లీ:భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కొన్ని కుటుంబాల గుప్పెట్లో బందీగా మారిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ జరిపిన తాజా అధ్యయనం నిరూపించింది. దేశంలోని మొత్తం 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఐదో వంతు మంది రాజకీయ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారేనని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. లోక్‌సభలో ఏకంగా 31 శాతం మంది సభ్యులు, రాజ్యసభలో 19 శాతం మంది వారసత్వ…

Read More

ప్యాలెస్ పాలిటిక్స్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More