GenZ Loans

నేటి తరం అప్పుల మయం – ఫ్యాషన్ కోసం ఫైనాన్స్ ఉచ్చు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటి తరం రుణగ్రహీతలు పుట్టుకొస్తున్నారు. డిజిటల్ లెండింగ్ పుణ్యమా అని 30 ఏళ్ల లోపు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేలి చివరన లోన్ యాప్స్ ఉండటంతో అవసరం లేకున్నా అప్పులు చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్షల రూపాయల బాకీలతో కుర్రకారు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అప్పు తీసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. జేబుకు చిల్లు పెడుతున్న యాప్స్దేశ జనాభాలో సగం మంది ఉన్న 30 ఏళ్ల…

Read More
GenZ - Male Hates Female

అమ్మాయి కాదు అమ్మోరు – మ్యానోస్పియర్… మహిళలపై మగ శత్రుత్వం

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడవడమే అని మన తాతలు చెప్పారు. కానీ నేడు ఆ చేతులు కేవలం ఫోన్లనే పట్టుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఒంటరి దీవిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరిగింది. ప్రేమ సామ్రాజ్యంలో చీకటి అలుముకుంది. ఈ నిశ్శబ్ద యుద్ధం వెనుక ఉన్న అసలు నిజాలను లియా గ్రీన్ తన అన్వేషణలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఒంటరి పక్షుల వింత లోకంప్రపంచవ్యాప్తంగా…

Read More
GenZ Gap Year Craze

పుస్తకం లేని ప్రపంచం – చదువు మధ్యలో జెన్ జెడ్ సాహస యాత్ర

సహనం వందే, హైదరాబాద్: పుస్తకాల మోత.. పరీక్షల వేట.. 15 ఏళ్ల సుదీర్ఘ బడి జీవితం తర్వాత ఆ కళ్లలో ఏదో అలసట. రేపటి పోటీ ప్రపంచంలోకి దూకడానికి ముందు ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోవాలనే ఆరాటం. ఇది కేవలం విరామం కాదు.. తనను తాను వెతుక్కునే ప్రయాణం. ఈ తరం యువత చదువుల మధ్యలో గ్యాప్ ఇయర్ తీసుకుంటూ కొత్త పాఠాలు నేర్చుకుంటోంది. అలసిన గుండెలకు విశ్రాంతిహైదరాబాదుకు చెందిన 18 ఏళ్ల షీలా, సుస్మిత…

Read More
GenZ Politics in Nepal

జెన్ జెడ్ విప్లవం… కుర్రాళ్ల రాజ్యం – నేపాల్‌లో యువకుల చేతుల్లోకి రాజ్యాధికారం

సహనం వందే, నేపాల్: హిమాలయాల చెంత జెన్ జెడ్ యువత గర్జించింది. పాత తరం రాజకీయ నాయకుల కోటలు బద్దలయ్యాయి. ఒకప్పటి రాపర్ గాయకుడు… ఖాట్మండు మాజీ మేయర్ బలేన్ షా నేతృత్వంలో సరికొత్త చరిత్ర మొదలైంది. అవినీతిపై తిరగబడ్డ యువత బ్యాలెట్ బాక్సుల ద్వారా తమ ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు… ఒక తరం మార్పునకు నిదర్శనం. యువ కెరటంనేపాల్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి…

Read More
GenZ IQ Level

మేధస్సులో జెన్ ‘డెడ్’ – నేటి తరంలో కరిగిపోతున్న ఐక్యూ లెవల్స్

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి పెరుగుతుందని అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడు. ముఖ్యంగా జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టిన వారు) తమ తల్లిదండ్రుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మానవ మేధస్సు తిరోగమనంలో పయనిస్తోంది. ఫ్లిన్ ఎఫెక్ట్ కు పాతరగత 100 ఏళ్లుగా ప్రతి కొత్త తరం…

Read More
GenZ Zero peace

జెన్ జెడ్ జీరో పీస్ – విలాసవంతమైన జీవితం… విపరీత ఒత్తిడి

సహనం వందే, హైదరాబాద్: నేటి తరం (జెన్ జెడ్) యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్.. కళ్ల ముందు అనంతమైన ప్రపంచం ఉంది. పాత తరంతో పోలిస్తే తిండి, బట్ట, వసతులకు లోటు లేదు. కానీ గుండెల్లో మాత్రం ఏదో తెలియని గుబులు. సౌకర్యాల మధ్య పెరుగుతున్నా శాంతి కరువవుతోంది. ఆందోళన, కుంగుబాటు ఇప్పుడు వీరిని నీడలా వెంటాడుతున్నాయి. ఆందోళనల అడ్డాగా యువత జెన్ జెడ్ అని పిలిచే 12 నుండి 27…

Read More
Education GenZ Skills

ఈ చదువులు మాకొద్దు – ఇంజనీరింగ్ వంటి చదువులకు యువత స్వస్తి

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు చౌదరి గారి అబ్బాయి అంటే ఇంజనీరింగ్ చదవాల్సిందే. ఐఏఎస్ లేదా డాక్టర్ కాకపోతే కనీసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా సాధించాలన్నది తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి యువత ఆ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను తుడిచిపెట్టేస్తోంది. డిగ్రీల కంటే స్కిల్స్ ముఖ్యం అంటూ సరికొత్త కెరీర్ బాట పడుతోంది. నచ్చిన పని చేస్తూ నలుగురిలో ప్రత్యేకంగా నిలవడమే లక్ష్యంగా జెన్ జెడ్ తరం దూసుకుపోతోంది. మారిపోతున్న కెరీర్ రూపురేఖలు…దేశంలో…

Read More

భజన్ రాక్… ‘జెన్ జెడ్’ కిరాక్ – ఇండియాలో భక్తికి యువతరం మోడ్రన్ టచ్

సహనం వందే, ముంబై:యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్…

Read More

యువత మౌనం వెనుక మర్మం! – జెన్ జడ్ నిశ్శబ్దం… వీధుల్లోకి రాని నేటితరం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో దాదాపు 37 కోట్ల మంది జెన్ జడ్ యువత ఉంది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో నిత్యం అనుసంధానమై ఉన్న ఈ శక్తిమంతమైన తరం… దేశంలో ఉన్న అవినీతి, అసమానతలు, రాజకీయ గందరగోళంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. కానీ వీధుల్లోకి వచ్చి గళమెత్తడానికి మాత్రం వెనుకాడుతోంది. దేశద్రోహం ముద్ర పడుతుందనే భయం, కుల, ప్రాంతీయ విభజనలు, నిరుద్యోగంతో కూడిన ఆర్థిక ఒత్తిళ్లు, మార్పు అసాధ్యమనే నిరాశ… నేటి తరాన్ని నిశ్శబ్దంగా ఉంచుతున్నాయి….

Read More

అమెరికా అల్లకల్లోలం- 70 లక్షల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా‌…

సహనం వందే, అమెరికా:అమెరికా అల్లకల్లోలంగా మారింది. 2700 పట్టణాలు, నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ విధానాలపై గళమెత్తుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ట్రంప్ రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో ఈ ఉద్యమం జరుగుతుంది. గత జూన్‌లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయగా… ఇప్పుడు దాదాపు నాలుగింతల మంది…

Read More