అందరివాడు… ఎవరూ లేనివాడు – చిరంజీవికి అండగా నిలవని తమ్ముళ్లు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచే సరైన స్పందన కరువైంది. ముఖ్యంగా సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడంపై మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి అండగా నిలవాల్సిన సొంత తమ్ముళ్లు కూడా సైలెంట్‌గా ఉండటంతో……

Read More

అసెంబ్లీలో అఖండ ‘చంద్ర’ప్రచండ – చంద్రబాబునూ వదలని బాలయ్య బాబు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే బాలయ్య బాబు విశ్వరూపం చూపించారు. అఖండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సొంత ప్రభుత్వం పైనా… మాజీ సీఎం జగన్ పైనా చెలరేగిపోయారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవినీ ఇరికించేశారు. రాజకీయంగా సొంత పార్టీనీ… పెద్దలను చెడుగుడు ఆడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభను స్తంభింపజేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు జగన్‌ను కలిసిన వివాదాస్పద అంశంపై మాటల…

Read More

జ’గన్’పై రాజారెడ్డి మిస్సైల్ – రాజకీయాల్లోకి జగన్ మేనల్లుడు రాజారెడ్డి

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వై.ఎస్. కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల కుమారుడు వై.ఎస్. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల కీలక ప్రకటన చేశారు. కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు రాజారెడ్డిని తీసుకువెళ్లి ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్. రాజారెడ్డికి ఎప్పుడు అవసరం అయితే…

Read More

అన్నయ్య వర్సెస్ తమ్ముడు-నాగబాబుకు మంత్రి పదవిపై సందిగ్ధత

సహనం వందే, అమరావతి:నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

లోకేష్ రెడ్ బుక్ ఉగ్రరూపం – జగన్ కు చుక్కలు….

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మంటలు రేపుతుంది. జగన్ పరివాహరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కిందిస్థాయి కార్యకర్త మొదలు జగన్ వరకు ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ లోన పడేస్తున్నారు. జగన్ కు అండగా నిలబడిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారు. కారు కింద పడి చనిపోయినందుకు ఏకంగా జగన్ నే టార్గెట్ చేశారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అంతే…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

ఆర్థికమా? అధికారమా?

సహనం వందే, హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో…

Read More

ఒకే వ్యూహం… ఒకే గేమ్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు… మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులపై పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. వారిపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది‌. కేసీఆర్, జగన్‌లను అరెస్టు చేయడానికి ఇదే సరైన సమయంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భావిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తే రాబోయే ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో…

Read More