Health Insurance Claim rejected

లక్షల బిల్లు… బీమాకు చిల్లు – హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం

సహనం వందే, హైదరాబాద్: ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది….

Read More
World AIDs Day

టార్గెట్ 2030… ఎయిడ్స్‌ ఎండ్ – ఐదేళ్లలో వ్యాధి పూర్తి నిర్మూలనే లక్ష్యం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశం గత పదిహేనేళ్లలో హెచ్‌ఐవీ నియంత్రణలో విజయం సాధించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దేశ ఆరోగ్య రంగానికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. 2010 నుంచి 2024 మధ్య కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల్లో ఏకంగా 48.7 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఎయిడ్స్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 81.4 శాతం క్షీణించడం మరో గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. సరైన…

Read More
Online platform Food Safety Inspection

ఆన్ లైన్ లో సరు’కుళ్లు’- బ్లింక్ ఇట్, జెప్టో, జొమాటోల నాసిరకం సప్లై

సహనం వందే, హైదరాబాద్: ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మనం నిత్యం కొనే సరుకులు ఎంతవరకు సురక్షితం? తాజా తనిఖీల్లో వెల్లడైన వివరాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోరేజ్ సెంటర్లు, గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఎంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. గడువు ముగిసిన, నాణ్యత లేని సరుకులను అమ్ముతూ ఈ సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే…

Read More
Dr.Narahari TGGDA President raise voice on Allowances

అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ…

Read More
ఐ-బొమ్మ రవి తండ్రి అప్పారావు 'మెగా' వార్నింగ్

ఐ బొమ్మ అప్పారావు ‘మెగా’ వార్నింగ్ – సినిమా పరిశ్రమను ఉతికి ఆరేసిన రవి తండ్రి

సహనం వందే, హైదరాబాద్: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి అప్పారావు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి. కల్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదని… నిజంగా ఎన్‌కౌంటర్ చేయాలంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్న కల్యాణ్‌ను,…

Read More
64Complaints to Hydra in One day

బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా

సహనం వందే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న…

Read More
Suresh Chanda IAS complaints on Solar Electricity System

సోలార్ బిల్… ఐఏఎస్ ఫైర్ – చార్జీల పెంపుపై మాజీ సీఎండీ ఫిర్యాదు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సోలార్ వినియోగదారుల బిల్లులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. డిస్కం అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను పక్కనబెట్టి నెట్ మీటరింగ్ స్థానంలో గ్రాస్ మీటరింగ్‌ను అమలు చేయడమే దీనికి కారణం. గ్రిడ్‌కు ఇచ్చిన కరెంటుకు తక్కువ ధర చెల్లిస్తూ తీసుకున్న కరెంటుకు మాత్రం అధిక రిటైల్ ధర వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ రిటైర్డ్ సీనియర్…

Read More
AP Politicians' Weekend @Hyderabad

ఆదివారం ‘అమరావతి’ అనాథ – హైదరాబాదులో నేతల వీకెండ్ ఎంజాయ్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అంటే వారికి పీక్ అవర్స్ లో పని చేసే ఒక తాత్కాలిక కార్యాలయం మాత్రమే! వీకెండ్ వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అత్యున్నత అధికారులు అనేకమంది హుటాహుటిన హైదరాబాద్‌కి పరిగెడుతున్నారు! ఏపీ రాజకీయాలు, పాలన ఇప్పుడు వారాంతపు షటిల్ సర్వీస్‌ల చుట్టే తిరుగుతోంది. రాజధాని ప్రాంతంలో వారాంతంలో బోసిపోయి ఉంటుంది. ప్రత్యేక విమానంలోనే పయనం…వారాంతంలో నేతలు హైదరాబాదుకు వెళ్లడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలను……

Read More
ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

కోర్టు హుకూం… జగన్ కదిలెన్ – ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

సహనం వందే, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించలేదు. దీంతో చాలా ఏళ్ల విరామం తర్వాత గురువారం (నేడు) ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘంగా బెయిల్‌పై ఉన్న జగన్… చివరిసారిగా 2020 జనవరి 10న కోర్టుకు వచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలు, భద్రతా కారణాలు చూపుతూ కోర్టుకు రాకుండా…

Read More

‘బొమ్మ’కు బ్రేక్… హీరోల ఖుష్ – ఐ బొమ్మ మూసివేతతో పైరసీ ముగిసినట్టేనా?

సహనం వందే, హైదరాబాద్:సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి రెండు కంపెనీలకు సీఈఓ స్థాయికి ఎదిగిన ఓ యువ మేధావి… చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయనే ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ సైట్లకు సూత్రధారి ఇమ్మడి రవి. తన కంప్యూటర్ టెక్నాలజీ నైపుణ్యాన్ని సరైన మార్గంలో కాకుండా సినిమా పరిశ్రమను నాశనం చేసే పైరసీ దారికి మళ్లించాడు. రవి టెక్నాలజీ నైపుణ్యం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. అతనిని జైలుకు పంపించడంతో…

Read More