రాందేవ్ బ్రాండ్ కారంతో రోగం – పురుగుమందుల మోతాదు అధికం!
సహనం వందే, న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులు, ఆరోగ్యం అంటూ డబ్బా కొట్టుకునే బాబా రాందేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ కంపెనీకి లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఎర్ర కారం పొడి శ్యాంపిల్స్‌లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయాన్ని…