Celebrities in Public Events

తోపులాటల్లో సెలబ్రిటీలు – నిధి అగర్వాల్, సమంతలకు చుక్కలు

సహనం వందే, హైదరాబాద్: సెలబ్రిటీలు కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడటం సహజమే అయినా అది హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా అగ్ర కథానాయిక సమంతకు హైదరాబాదులో ఎదురైన అనుభవం ఇప్పుడు సంచలనంగా మారింది. జనం మధ్య చిక్కుకుని ఆమె పడ్డ ఇబ్బంది చూస్తుంటే నగరంలో భద్రత ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రక్షణ కరువైన వేళ భాగ్యనగరం పరువు పోతోందని విపక్షాలు సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తోపులాటలో సమంతహైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సమంతకు…

Read More
60 Lakh Voters Risk in Telangana - Chief Election Commissioner

తెలంగాణలో 35 లక్షల ఓట్ల ఊచకోత? – ఓట్ల సవరణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఎన్నికల నగారా మోగకముందే ఓట్ల రాజకీయం ముదిరింది. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాయడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేలా సాగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రానుంది. తెలంగాణలో ఓట్ల వేట రాష్ట్ర పర్యటనలో ఉన్న…

Read More
Talk of the Sunday - KCR Press Meet

టాక్ ఆఫ్ ది సండే కేసీఆర్ – రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎం సందడి

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాజకీయాల్లో ఆదివారం అసలైన హీట్ పుట్టింది. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్… దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్ళీ నోరు విప్పారు. తనదైన మార్కు విమర్శలతో అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్ యుద్ధానికి సిద్ధమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సండే పొలిటికల్ మండే…కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

రాహుల్ గాంధీ… హామీ ఏమైంది? – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదేంటి?

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల గళం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్న ధోరణిపై బీసీ మేధావులు కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినా ఆశించిన మార్పు రాకపోవడంపై అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ బీసీలకు మాత్రం…

Read More
Hush Dating

హుష్ డేటింగ్… కొత్త ట్రెండింగ్ – అడ్డూ అదుపూలేని హైదరాబాద్ చెత్త కల్చర్

సహనం వందే, హైదరాబాద్: గతంలో ప్రేమంటే ఒక గర్వం. పది మందికి చెప్పుకునే ఒక అందమైన అనుభూతి. కానీ ఇప్పుడు కలియుగం పరాకాష్టకు చేరింది. బంధాలకు రంగులు మారాయి. నిన్న మొన్నటి వరకు పెళ్లి పెటాకులు లేకుండా సహజీవనం అంటూ తిరిగారు. ఇప్పుడు అంతకుమించి చెత్త కల్చర్ హైదరాబాదును సర్వనాశనం చేస్తుంది. నగర యువత ఇప్పుడు కొత్త రూట్ పట్టింది. అదే హుష్ డేటింగ్. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ తెలియకుండా.. కేవలం ఇద్దరి మధ్యే సాగే ఈ…

Read More
Termination Orders

వైద్యులపై ఉక్కుపాదం – ఏపీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల తొలగింపు

సహనం వందే, విజయవాడ: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కోట్లాది రూపాయల జీతాలు తీసుకుంటూ ఏడాదిన్నర పైగా విధులకు ఎగనామం పెడుతున్న 62 మంది వైద్య అధ్యాపకుల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) జి.రఘునందన్ రావు నిర్ణయించారు. అనుమతి లేకుండా సంవత్సరానికి పైగా గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ప్రొవిజనల్ టర్మినేషన్ ఆర్డర్లు విడుదల…

Read More
Speaker Telangana

ఫిరాయింపుల కంపు రాజకీయం – పార్టీలు మారినా దొరకని ఆధారాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ముదిరి పాకాన పడింది. పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్ష్యాల వేటలో స్పీకర్ నాటకంగులాబీ గూడు వదిలి హస్తం నీడకు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తేల్చారు. కళ్లముందే పార్టీ కండువాలు మార్చుకున్నా సాక్ష్యాలు లేవనడం హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ…

Read More
Hyderabad link in Australia Attack

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ‘ఉగ్ర’రూపం – సిడ్నీ కాల్పుల టెర్రరిస్ట్ రాజధాని వాసుడే

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలతో హైదరాబాద్‌ కు లింకులు పదే పదే వెలుగులోకి రావడం దేశ భద్రతకు పెను సవాల్‌గా మారింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ కాల్పుల దాడిలో 15 మందిని పొట్టనబెట్టుకున్న సాజిద్ అక్రమ్ అనే ఉగ్రవాదికి భారత పాస్‌పోర్ట్, అది కూడా హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లు గుర్తించడం అనేక ప్రశ్నలకు దారితీసింది. సాజిద్ అక్రమ్ భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, అతని రాడికలైజేషన్ అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉంది. హైదరాబాద్…

Read More
Kavitha

కవిత అక్క… పార్టీ పక్కా – రాజకీయాలపై రగిలిపోతున్న జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని…

Read More
Congress MLAs fails in Local Body Elections

తరిమికొట్టిన సొంతూరు – సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సెగ

సహనం వందే, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లోనే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత గూటిలోనే ఓటర్లు పక్క చూపులు చూడటంతో దీనిపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అధికారం చేతిలో ఉన్నా సొంత గ్రామాలను గెలిపించుకోలేని ఈ దుస్థితి ఏమిటని అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో…

Read More