లోకల్ ఫుడ్సే… సూపర్‌ఫుడ్స్ – స్థానిక పండ్లు… కూరగాయలే ఆరోగ్యానికి రక్ష
సహనం వందే, హైదరాబాద్:ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మెరుస్తున్న అకై బౌల్స్… కెఫెల్లో కనిపించే స్పిరులినా స్మూతీలు… వీటిని చూసి సూపర్‌ఫుడ్స్ అనే పదానికి అలవాటు పడిపోయాం. ఈ ఆహారాలు బరువు తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయని… శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయని… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిరోధిస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం ఇవి మ్యాజిక్ చేసే మందులు కాదని… బ్యాలెన్స్‌డ్‌గా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినడమే నిజమైన ఆరోగ్య రహస్యం అని…