జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
జడ్జీల సంఘం నేతలు మురళిమోహన్, ప్రభాకరరావు సంతాపం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఆమె మృతికి తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షులు కె. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.మురళి మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయసేవల రంగంలో ప్రియదర్శిని చేసిన కృషిని వారు కొనియాడారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు….