కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై రైతుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ గళమెత్తింది. సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ శక్తులు, కొందరు అధికారులు ఆయిల్ ఫెడ్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం తమ…

Read More

ఆయిల్ ఫెడ్ లో ‘సిద్ధిపేట’ కుంభకోణం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు ఆకాశాన్ని అంటాయి. అందులో పని చేసే కీలక అధికారులే దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో పనిచేసిన ఒక ఎండీ ఈ అక్రమాలకు తెర లేపగా… దాన్ని ప్రస్తుతం ఒక మేనేజర్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రూ. 100 కోట్లకు పైగా మెక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు ఆయిల్ ఫెడ్ ను నట్టేట ముంచేశారు. వారి దుర్బుద్ధి కారణంగా ఆయిల్…

Read More

అందం వెనుక విషాదం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం. 16 ఏళ్లలోనే జీవిత పాఠం…2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని…

Read More

నీళ్లు లేని ఫైరింజన్లు

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్‌లో 18న ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య విభాగాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబీకులను కోల్పోయామని ఆవేదనతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సన్నద్ధత లేమి ఈ విషాదానికి ప్రధాన…

Read More

కేసీఆర్ అండతో జీ’ఎస్ఆర్’

సహనం వందే, హైదరాబాద్: గడల శ్రీనివాసరావు… తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న కాలంలో మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ విభాగాన్ని గడల సామంత రాజ్యం (జీఎస్ఆర్)గా మలుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ చూసుకొని మరీ పెచ్చుమీరిపోయారు. ఎందుకో ఏమో కానీ గడలను ఒకానొక సందర్భంలో పక్కన పెట్టాలని అనుకున్న కేసీఆర్.‌‌.. కరోనా కాలంలో అందలం ఎక్కించారు. దీంతో గడలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ ఐఏఎస్,…

Read More

పవన్ తో పెట్టుకుంటే పతనమే

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగ్గుమంటున్నారు. తమ కూటమి ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవడం పైన… తన సినిమా విషయంలో అడ్డువస్తున్న వారిపట్ల ఆయన మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇతర సినీ పెద్దలపై కన్నెర చేశారు. పవన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని…

Read More

కరోనా శవాలపై రూ. 450 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్: ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో 2020 నుంచి ప్రజారోగ్య విభాగం పరిధిలోని అనేకమంది జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై పడి అందినంత దోచుకున్నారు. రోగులకు సాయం చేయాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కాలంలో రూ.కోట్లు దండుకోవటమే పనిగా కొందరు అధికారులు వ్యవహరించారు. కరోనా చావులపై పైసలు ఏరుకున్నారు. వందల ఫిర్యాదులు… చర్యలెక్కడ?కరోనా సమయంలో…

Read More

‘నకిలీ’ల చేతిలో ప్రాణాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, అనధికార ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా మారి, నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు, ఆసుపత్రులు నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో ఇటీవల జరిగిన తనిఖీలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దందా ఇంకా కొనసాగుతుండటం ఆందోళన…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More