దేశం విడిచిపోతున్న ధనలక్ష్మి – విదేశాలకు వెళ్లిపోతున్న బిలియనీర్లు
సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు…