పేదింటి చదువుకు సొంతిల్లు తాకట్టు – డాక్టరమ్మ చదువుకు హరీష్ రావు అండ
సహనం వందే, సిద్దిపేట: కష్టం వస్తే కాదనని మనసు… కన్నీరు వస్తే కరిగిపోయే తత్వం ఆయనది. సిద్దిపేట బిడ్డల భవిష్యత్తు కోసం తన ఆస్తులను సైతం పణంగా పెట్టే గొప్ప మానవతావాది హరీష్ రావు. తాజాగా ఒక నిరుపేద వైద్య విద్యార్థిని మెడికల్ పీజీ చదువు ఆగిపోకుండా ఉండేందుకు ఆయన ఏకంగా తన స్వగృహాన్నే బ్యాంకులో తనఖా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫీజు గండం నుంచి బయటపడేలా…సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని…