ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది….

Read More

ఆధునిక వైద్యంపై విషం – సొంత వైద్యంతో క్యాన్సర్…కూతురి బలి

సహనం వందే, లండన్:ఆమె కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒక యువతి. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమెకు కీమోథెరపీ చేస్తే 80 శాతం తగ్గుతుందని డాక్టర్లు నిర్ధారించారు. కానీ తల్లి ఆధునిక వైద్యాన్ని తిరస్కరించి… అశాస్త్రీయ మొక్కల ఆధారిత థెరపి చేయించి కూతురి ప్రాణాలను బలిపొంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ సోదరి… తమ తల్లి ప్రచారం చేసిన వైద్య వ్యతిరేక సిద్ధాంతాల వల్లే కన్నుమూసిందని ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. అపోహల…

Read More

తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు. మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1…

Read More

విమాన వేగంతో ఖమ్మం హైవే మీదుగా విశాఖకు ప్రయాణం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధం అవుతుంది. వచ్చే ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అంటే రాబోయే కీలకమైన సంక్రాంతి పండుగకు రయ్ రయ్ మంటూ విశాఖపట్నం దూసుకుపోవచ్చు. మధ్యలో ఉండే రాజమండ్రి ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ఏకంగా 56 కిలోమీటర్లు తగ్గటం విశేషం. ఇప్పటివరకు ఈ మార్గంలో ప్రయాణం చేయడం అత్యంత…

Read More

వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ

సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….

Read More

ఓజస్ తేజో ఆధ్వ‌ర్యంలో… యోగా దినోత్స‌వ వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ డీడీ కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ… యోగా విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక,…

Read More

బతుకుపై బండ… చావుకు అండ…ఇంగ్లాండ్ లో చట్టం

సహనం వందే, ఇంగ్లాండ్: ఎంతటి తీవ్ర అనారోగ్యమైనా సహజ మరణం వచ్చేవరకు కాపాడుకోవడం మానవుడి లక్షణం. కానీ రోజులు మారుతున్నాయి. కలియుగం దాపురించింది. కొన ఊపిరి ఉన్నంతవరకు తోటి మనిషిని కాపాడుకోవాల్సిన మానవజాతి… వారిని వదిలించుకునేందుకు ఏకంగా చట్టాలు చేస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. చచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. కొన్ని దేశాల్లో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. మరణం హక్కుగా మారుతుండడం మానవత్వానికి మచ్చ. ఇంగ్లాండులో బిల్లుకు ఏర్పాటు..‌.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Read More

విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్:విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు….

Read More

అగ్రికార్పొరేషన్లలో అవినీతి క్రీడ-కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

సహనం వందే, హైదరాబాద్: అన్నదాతలకు అన్ని విధాలా సాయం చేయాల్సిన వ్యవసాయ కార్పొరేషన్లు ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా మారాయి. అగ్రి కార్పొరేషన్లనన్నీ రైతుల ఆస్తులుగానే పరిగణించాలి… కానీ వాటిల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ సొంత జాగీరులా భావించటం సంస్థల స్ఫూర్తికే విరుద్ధం. ఆ సంస్థల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఉద్యోగులే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి సమగ్ర నివేదిక…

Read More