సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – 225 స్టాఫ్ అసిస్టెంట్ల భర్తీ
సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆరు జిల్లాల్లో ఉన్న ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలుఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అత్యధికంగా 99 ఖాళీలు ఉన్నాయి. కరీంనగర్‌లో 43, హైదరాబాద్‌లో 32 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మెదక్,…