బహుజన హక్కుల బలిదానం – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చుక్కెదురు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బహుజన సమాజానికి విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి రంగాలలో సరైన అవకాశాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయన్న సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి బహుజనుల రాజ్యాంగ హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిణామం దేశంలోని…

Read More

ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…

Read More

కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం

సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…

Read More

ప్రజా’రోగ్’ కార్యాలయం – ప్రజారోగ్య విభాగంలో అధికారి హరి లీలలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రజారోగ్య కార్యాలయం అవినీతికి, లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందనేందుకు తాజా లీగల్ నోటీసు తిరుగులేని రుజువు. ఒక సీనియర్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అందులోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఫిర్యాదు చేయడం వైద్య ఆరోగ్య శాఖలో సంచలనం అయింది. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహ సహా ఉన్నతాధికారులకు లీగల్ నోటీసులు జారీ చేయడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. అవినీతి ఆరోపణలతో పాటు మహిళల వేధింపుల ఫిర్యాదులు నిత్యం…

Read More

మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

బీజేపీ రాగం… టీడీపీ విలాపం – తెలంగాణ తెలుగుదేశం నేతల నిరాశ

సహనం వందే, అమరావతి/హైదరాబాద్:తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత కదిలినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర టీడీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని… ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానించడం టీడీపీకి దిశానిర్దేశం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…

సహనం వందే, హైదరాబాద్:బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి….

Read More

దళిత ‘సుప్రీం’పై దమనకాండ – ప్రధాన న్యాయమూర్తిపైనే కులోన్మాదం

సహనం వందే, న్యూఢిల్లీ:ఈ దేశంలో అత్యున్నత పదవుల్లోని బహుజన, దళిత వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. దేశ మాజీ రాష్ట్రపతి కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి… ఇద్దరూ దళితులే కావడంతో వారిపై అడుగడుగునా కులోన్మాదులు అనేక విధాలుగా మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిశోర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని…

Read More