ఆడి కారు… సుమంత్ షికారు – ఏడాది క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా జీవితం
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో సుమంత్ ఎదుగుదల అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వంలోని లొసుగులకు నిలువెత్తు సాక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు పద్ధతిపై చేరిన ఈయన… మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఏకంగా ఆమె కార్యాలయంలోనే ఓఎస్‌డీగా డిప్యూటేషన్‌పై చేరాడు. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఐఏఎస్ అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చే స్థితికి రావడం ఆయన చేతిలో మంత్రి కార్యాలయం మొత్తం బందీ అయిందనడానికి నిదర్శనం. అటవీ శాఖలో బదిలీలు, పదోన్నతుల్లో భారీగా లంచాలు వసూలు చేయడం,…