నేపాల్‌లో ‘జెన్-జెడ్’ విప్లవం – సోషల్ మీడియా నిషేధంపై కన్నెర్ర

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్-జెడ్’ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ఈ ఉద్యమం మొదలైంది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించారు. 300 మందికి పైగా…

Read More

వేటు కోసం వెయిట్ – బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల రగడ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం సంచలనం సృష్టించింది. ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో…

Read More

కూలీ వేషంలో కాకీ – ముంబై పోలీసుల అనూహ్య వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక వాడ కేంద్రంగా నడుస్తున్న ఒక భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే రసాయన కర్మాగారం ముసుగులో మెఫడ్రోన్ డ్రగ్స్ తయారవుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. రజనీకాంత్ సినిమా తరహాలో ఒక కానిస్టేబుల్‌ను కార్మికుడిగా పంపి నెల రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో రూ.12 వేల…

Read More

పాప కోసం ప్రధాని పంతం – అయినా లెక్క చేయని జర్మనీ దేశం

సహనం వందే, న్యూఢిల్లీ:బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్‌ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం…

Read More

విజయనగరం ఎంపీకి విశిష్ట గౌరవం – మహారాష్ట్ర తెలుగు సంఘం సభకు కలిశెట్టి

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో మహారాష్ట్ర తెలుగు మేళవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలోని థానే వెస్ట్ వసంత విహారలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కోటికి పైగా సభ్యత్వం ఉన్న ఈ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా…

Read More

వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More

తురకపాలెం… మరణ మృదంగం – 60 రోజుల్లో 30 మంది మృతి

సహనం వందే, గుంటూరు:గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా కారణం తెలియని మరణాలు జనాన్ని వణికిస్తున్నాయి. ఆరోగ్యంగా కనిపించే వారు ఒక్కసారిగా సాధారణ జ్వరంతో చతికిలబడుతున్నారు. ఆసుపత్రికి వెళితే శవమై తిరిగొస్తున్నారు. కొందరు క్షేమంగా ఇంటికి వచ్చినా, కొన్ని రోజులకే పరలోకాలకు చేరుతున్నారు. 60 రోజుల్లో 30 మంది మరణించడంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. రోజూ ఎవరో ఒకరు చనిపోతున్న ఈ దుస్థితి ఊరిని భయంతో కమ్మేసింది. వైద్య పరీక్షల్లో నార్మల్ గానే రిపోర్టులు…విచిత్రం…

Read More

సీక్రెట్ రొమాన్స్… కార్పొరేట్ క్రాష్ – రహస్య ప్రేమాయణాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్:కార్పొరేట్ ప్రపంచంలో నైతిక ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువైంది. నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఒక సీఈవో వ్యక్తిగత వ్యవహారం కారణంగా తన పదవిని కోల్పోయారు. సంస్థాగత నియమాలకు వ్యతిరేకంగా ఒక సబార్డినేట్‌తో రహస్య సంబంధం పెట్టుకోవడమే ఆయన పతనానికి కారణమైంది. ఈ ఘటన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సంస్థ నిబంధనలను పాటించాలన్న కఠిన సందేశాన్ని ఇచ్చింది. సీక్రెట్ రొమాన్స్ తో ఏడాదిలోనే వేటు…39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా…

Read More

సీపీఎం నేత నర్రా రమేష్ మృతి

సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read More

గురుశిష్యుల చెడుగుడు – కేసీఆర్, జగన్ లకు బాబు, రేవంత్ చుక్కలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీలు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మద్యం కుంభకోణం ఈ రెండు పార్టీల పతనానికి కారణమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం సీబీఐ విచారణల నీడలో చిక్కుకుంటే, మరోవైపు జగన్ చుట్టూ సిట్ విచారణల ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణాల పర్వం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తోంది….

Read More