రగులుతున్న గిరిజన వివాదం – లంబాడీల ఆత్మగౌరవ పోరాటం

సహనం వందే, కొత్తగూడెం:కొత్తగూడెం పట్టణం లంబాడీల ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తిపోయింది. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ… రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ఆదివాసీలతో, మరోవైపు లంబాడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం సమస్యను పరిష్కరించడానికి కాదని,…

Read More

జెన్ జెడ్ వెనుక ‘డీజే’ సౌండ్ – నేపాల్ ను కుదిపేసిన నేత సుదాన్ గురుంగ్

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది…

Read More

లోకల్ ఫుడ్సే… సూపర్‌ఫుడ్స్ – స్థానిక పండ్లు… కూరగాయలే ఆరోగ్యానికి రక్ష

సహనం వందే, హైదరాబాద్:ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మెరుస్తున్న అకై బౌల్స్… కెఫెల్లో కనిపించే స్పిరులినా స్మూతీలు… వీటిని చూసి సూపర్‌ఫుడ్స్ అనే పదానికి అలవాటు పడిపోయాం. ఈ ఆహారాలు బరువు తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయని… శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయని… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిరోధిస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం ఇవి మ్యాజిక్ చేసే మందులు కాదని… బ్యాలెన్స్‌డ్‌గా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినడమే నిజమైన ఆరోగ్య రహస్యం అని…

Read More

ప్రేమతో మీ అనుష్క… – అభిమానులకు ప్రత్యేకంగా లేఖ

సహనం వందే, హైదరాబాద్:సినీ తార అనుష్క శెట్టి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ఘాటి విడుదలైన కొద్ది రోజులకే ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే’ అంటూ ఆమె పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసులను కదిలించింది. ఈ నిర్ణయం సినిమా వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆమె త్వరగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఘాటి…

Read More

జనం నెత్తిన వారసత్వం – కుటుంబాల గుప్పిట్లో ప్రజాస్వామ్యం

సహనం వందే, న్యూఢిల్లీ:భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కొన్ని కుటుంబాల గుప్పెట్లో బందీగా మారిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ జరిపిన తాజా అధ్యయనం నిరూపించింది. దేశంలోని మొత్తం 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఐదో వంతు మంది రాజకీయ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారేనని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. లోక్‌సభలో ఏకంగా 31 శాతం మంది సభ్యులు, రాజ్యసభలో 19 శాతం మంది వారసత్వ…

Read More

హోమియోపతి వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్లేనా?

సహనం వందే, మహారాష్ట్ర:మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వైద్య సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. హోమియోపతి వైద్యులను వైద్య మండలిలో నమోదు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి పెను ప్రమాదమని, ఇది వైద్య వ్యవస్థలో అవినీతికి దారితీస్తుందని ఐఎంఏ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం హోమియోపతి వైద్యుల లాబీయింగ్‌కు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బొంబే హైకోర్టులో కేసు…

Read More

సీడ్ సర్టిఫికేషన్ అథారిటీకి అవార్డు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో జరిగిన ఇండో-ఆఫ్రికా సమ్మిట్‌లో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్‌సీఏ) విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకుంది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా విత్తన రంగంలో విశేష సేవలందించిన సంస్థలకు ఈ అవార్డును అందజేశారు. అందులో భాగంగా తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇది గర్వకారణం. విత్తన రంగంలో ఆదర్శం…తెలంగాణ…

Read More

ఎత్తుకు వైద్యం… వికటిస్తే వైకల్యం – ఫ్యాషన్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత

సహనం వందే, హైదరాబాద్:ఎత్తు పెరగాలనే కోరిక… దానికోసం ప్రాణాలను పణంగా పెట్టేంత పరిస్థితి దాపురించడం ఒక ఆందోళన కలిగించే అంశం. వ్యాయామం, సరైన ఆహారం, చిట్కాలు లాంటివి ఫలితం ఇవ్వనప్పుడు యువత ఫ్యాషన్ కోసం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఎత్తు పెంచే వైద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ ఆపరేషన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే దీనిలోని ప్రమాదాలను బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలోనూ…

Read More

ఎవరేమనుకుంటారో…? – ఈ ప్రశ్నే విద్యార్థుల ఆత్మహత్యకు కారణం

సహనం వందే, హైదరాబాద్:పరీక్షా ఫలితాలు వచ్చాయి. యోగిత తన గదిలో తలుపు వేసుకుని కూర్చుంది. రిలేటివ్స్ ఫోన్ల మోత… కోచింగ్ సెంటర్ల హడావుడి… గుమ్మం బయట తల్లి నిట్టూర్పు… ఇవన్నీ యోగితకు ఓ ఉచ్చులా బిగుసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లతో ఉన్న యోగిత తెల్లరేసరికి నిర్జీవంగా మారింది. ఇదొక్క యోగిత కథే కాదు. మధ్యతరగతి కుటుంబాలలో ఇలాంటి విషాదాలు నిత్యకృత్యం. మార్కులకు, ర్యాంకులకు ప్రాణం అర్పించే ఎంతోమంది విద్యార్థుల వేదన ఇది. 2022లో మన దేశంలో 1.7…

Read More

డాక్టర్‌ రఘురామ్‌ కు గ్లాస్గో కీర్తి కిరీటం

సహనం వందే, లండన్:హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రొమ్ము క్యాన్సర్‌ శస్త్రవైద్యుడు డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత గ్లాస్గో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (ఆర్‌సీపీఎస్‌జీ) ఆయనకు గౌరవ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. దక్షిణాసియాలో ఈ గౌరవం పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 1997లో ఇదే కాలేజీ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పరీక్షలో అర్హత పొంది ఇప్పుడు గౌరవ ఫెలోషిప్‌ అందుకున్న ఏకైక శస్త్ర వైద్యుడుగా ప్రపంచంలోనే…

Read More