అమెరికాలో హై’డ్రగ్స్’బాద్ నరమేధం – ఫెంటానిల్‌ వాడి వందల మంది మృతి

సహనం వందే, హైదరాబాద్:వసుధ ఫార్మా కెమ్ కంపెనీ అమెరికాతో సహా పలు దేశాల్లో డ్రగ్ నరమేధం సృష్టిస్తుంది. ఆ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్‌ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో ఆ దేశంలో వందల మంది చనిపోయారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను ఈ ఏడాది మార్చి 20వ తేదీన అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. దీనిపై అప్పుడే సహనం వందే…

Read More

కిమ్ ట్రైన్… మిస్సైల్ రైడ్ – బాంప్రూఫ్ రైల్లో కిమ్ చైనాకు ప్రయాణం

సహనం వందే, ఉత్తర కొరియా:ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆరేళ్ల తర్వాత పొరుగు దేశం చైనాలో పర్యటించిన ఆయన విమానంలో కాకుండా తన ప్రత్యేకమైన బాంప్రూఫ్ రైలులో ప్రయాణించడం అంతర్జాతీయ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం కాదు. ఒక కదిలే భద్రతా కోట. సుమారు 90 కోచ్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ, మిస్సైల్ వ్యవస్థ, బాంబు నిరోధక వ్యవస్థలు, అత్యంత విలాసవంతమైన…

Read More

ఎంఎన్ జేలో ఏం జరుగుతుంది? – డైరెక్టర్ తొలగింపుపై సీఎస్ ఆదేశాలు బేఖాతర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆదేశాలు పట్టవా? ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఆదేశాలనే తుంగలో తొక్కుతున్నారు. వారం క్రితమే ఆయన ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా…

Read More

అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

గాజా యుద్ధంలో జర్నలిస్టుల ఊచకోత – 210 మంది హత్య

సహనం వందే, న్యూయార్క్:గాజా యుద్ధంలో జర్నలిస్టులను టార్గెట్ చేసి ఇజ్రాయిల్ హత్య చేస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 50 దేశాల నుంచి 200కు పైగా మీడియా సంస్థలు సోమవారం భారీ నిరసనలకు దిగాయి. పత్రికలు నల్లటి ముఖ చిత్రాలను ప్రచురించగా… టెలివిజన్, రేడియోలు తమ ప్రసారాలను నిలిపివేశాయి. ఈ నిరసన ద్వారా గాజాలో స్వేచ్ఛాయుత వార్తా కవరేజీకి అనుమతించాలని, అమాయక జర్నలిస్టుల హత్యలను ఆపాలని డిమాండ్ చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్,…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More

కాళేశ్వరంలో సునామీ – సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో అట్టుడికిపోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించడం సంచలనం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి లోతుగా దర్యాప్తు జరగాలన్న ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీని తీవ్ర…

Read More

వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని…

Read More

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా…

Read More

ప్రవక్త బోధ… గోవధ నిషేధ – సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం

సహనం వందే, ముంబై:బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని,…

Read More