ఐదేళ్లలో క్యాన్సర్ అంతం – ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న వైద్య విద్యార్థి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:వైద్యశాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అనేక వ్యాధులకు ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త సాంకేతికత, అధునాతన చికిత్సా విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి కొన్ని ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం పూర్తిగా నిర్మూలించవచ్చని ఒక వైద్య విద్యార్థి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రిస్ క్రిసాంథౌ అద్భుతమైన వాదన…బుడాపెస్ట్‌కు చెందిన క్రిస్…

Read More

టాలీవుడ్ తో రేవంత్ చెడుగుడు – వణికిపోతున్న పెద్దపెద్ద సినీ హీరోలు

సహనం వందే, హైదరాబాద్:ఎక్కడా లేని విధంగా మన దగ్గర సినిమా హీరోల ఫోజులు మామూలుగా ఉండవు. తాము కేవలం నటులు మాత్రమే అన్న భావన నుంచి… దైవాంశ సంభూతులమన్న భ్రమల్లో బతుకుతుంటారు. జనం ఆదరణ చూసి తల పొగరు పెంచుకుంటారు. పైపెచ్చు జనం కొన్న టికెట్ల డబ్బుతోనే వందల కోట్లు కూడబెట్టుకొని తమకు ఎదురేలేదన్న భావనతో ఉంటారు. అలాంటి తల పొగరు సినీ నటులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గానే తలంటారు. దీంతో రేవంత్ రెడ్డి అంటే…

Read More

భట్టి కిరికిరి… రాజగోపాల్ కెలికి కెలికి

సహనం వందే, హైదరాబాద్:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాయి. పార్టీలో మరింత ముదురుతున్న ఈ వ్యవహారంపై భట్టి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా, పార్టీలోని ముఖ్య నేతల పైనా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన చేసిన ట్వీట్ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ లో…

Read More

మద్యం మత్తులోకి జొమాటో – ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ

సహనం వందే, హైదరాబాద్:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! మందు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. పదిమంది చూస్తారేమోనన్న భయం అక్కర్లేదు. కావాల్సిన బ్రాండ్, దానికి తోడు మంచి సైడ్ డిష్ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఒక కల కాదు. వాస్తవానికి మరో అడుగు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు కేరళ కూడా అదే బాటలో పయనిస్తోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫామ్‌లతో ఆన్…

Read More

ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు…

Read More

150 కోట్ల ‘కూలీ’… ఒక రోజు సెలవు

సహనం వందే, హైదరాబాద్:సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలుసాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ…

Read More

నర్సింగ్ ఉద్యోగాల్లో లింగ వివక్ష – పురుష నర్సులకు ప్రమోషన్లు కరువు!

సహనం వందే, హైదరాబాద్:నర్సింగ్ వృత్తిలో మహిళలకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే అపోహను దాటి, ఇప్పుడు పురుషులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారు. అయితే తెలంగాణలో పురుష నర్సులకు ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఎదురవుతోంది. సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్నప్పటికీ పాత జీవోల కారణంగా వారికి పదోన్నతులు రావడం లేదు. పాత నిబంధనలను సవరించాలని తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఎదురవుతున్న వివక్ష…2005లో పురుష విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా జీవో 82ను…

Read More

ఫిల్మ్ ఫెడరేషన్ భగ్గు – వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వేతనాలు పెంపు విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమైంది. రోజుల తరబడి నిరసనలు చేస్తున్న సినీ కార్మికులు, తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే సోమవారం నుంచి అన్ని షూటింగులు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్…

Read More

సూటు బూటు… దొంగ ఓటు – ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద…

Read More