బీపీ కొత్త లెక్కల షాకింగ్ – అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త గైడ్ లైన్స్

సహనం వందే, న్యూయార్క్:అధిక రక్తపోటును నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కలిసి శుక్రవారం విడుదల చేశాయి. 2017 తర్వాత వచ్చిన ఈ తాజా సూచనలు, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి వాటిని నివారించవచ్చని స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త నియమాలు పాతవాటి కంటే చాలా కఠినంగా ఉండడమే కాకుండా, మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సిఫారసు చేస్తున్నాయి….

Read More

ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 81% ఫెయిల్ – విదేశీ వైద్య విద్య డొల్ల…

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) ఫలితాల్లో విద్యార్థులు బొక్క బోర్లా పడ్డారు. ఈ ఏడాది జూన్ నెలలో నిర్వహించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 81 శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించిన ఫలితాల ప్రకారం 37,207 మంది ఈ పరీక్షకు హాజరైనప్పటికీ, కేవలం…

Read More

‘హైడ్రా’పై అవాస్తవాల దాడి – పుకార్లను నమ్మవద్దు

సహనం వందే, హైదరాబాద్:హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా, లేనిపోని అంశాలను హైడ్రాకు ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. అయినా హైడ్రా ఇవేవీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేయడానికే కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో కూడిన నగర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు చెరువులను అభివృద్ధి చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. ఈ పనులను కేంద్ర బృందాలు కూడా సందర్శించి…

Read More

‘వార్’లో గెలిచిన ‘కూలీ’ – బాక్సాఫీస్ యుద్ధంలో బాషా విజయం

సహనం వందే, సినీ బ్యూరో హైదరాబాద్:భారతీయ సినీ చరిత్రలో ఇండిపెండెన్స్ డే వీక్‌లో జరిగిన బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ చిత్రం కూలీ, మరోవైపు యువ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2… ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో హైప్ మధ్య విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలలో కూలీదే పై చేయిగా కనిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్… లోకేశ్…

Read More

ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో

(రేటింగ్: 2.5/5) సహనం వందే, హైదరాబాద్:వార్-2 సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు…

Read More

ఎంఎన్ జే డైరెక్టర్ రిటైర్మెంట్ రగడ

సహనం వందే, హైదరాబాద్:నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ చేయాల్సిన వ్యక్తి… ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ విధుల్లో ఉండడాన్ని మీరు ఎక్కడైనా చూశారా? అంతే కాదు ఒక రాష్ట్రంలో రిటైర్డ్ కావలసిన వ్యక్తి… మరో రాష్ట్రంలో దర్జాగా అధికారికంగా అదే స్థాయి హోదాలో ఉండడాన్ని ఏమనుకోవాలి? అచ్చంగా తెలంగాణలో ఒక డాక్టర్ విషయంలో అదే జరుగుతుంది. హైదరాబాదు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనివాసులును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అక్కడ పోస్టు లేదనే కారణంతో అది…

Read More

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఆగడాలు – నచ్చని సీటొచ్చినా రద్దు చేసుకోకుండా అడ్డు

సహనం వందే, హైదరాబాద్:ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి నచ్చని కాలేజీల్లో సీట్లు కేటాయించినప్పటికీ, అధికారులు పెట్టిన నిబంధనల వల్ల వాటిని రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను కొన్ని ప్రైవేటు కాలేజీలు అవకాశంగా తీసుకుని, విద్యార్థులపై పెత్తనం చెలాయిస్తున్నాయి. నిర్దిష్టమైన కళాశాలలో చేరకపోతే ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెనక్కి ఇవ్వబోమని బెదిరిస్తున్నాయి. దీంతో మంచి కళాశాలలు లేదా నచ్చిన కోర్సులో సీటు వస్తుందని ఆశపడిన విద్యార్థుల కలలు అడియాశలయ్యాయి. మూడో…

Read More

సీజన్ బాగుంది… యూరియా ఏదండి – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతన్న గోస

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ గొడవలతో తెలంగాణ రైతాంగం నలిగిపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోర నిర్లక్ష్యం చూపుతోందని, రైతుల బతుకులతో ఆడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగితాల మీద కేటాయింపులు చేసినట్లు చూపించి, నిజానికి సరఫరాలో లోటు తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కాగితాలపైనే కేటాయింపులు…తెలంగాణకు ఈ ఖరీఫ్ సీజన్‌లో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది….

Read More

ఓట్ల కుంభకోణం… లోక్‌సభ రద్దు – మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:తమిళనాడు విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసే ఉంటారు. అందులో తన ఓటును మరొకరు వేయడంపై పెద్ద పోరాటమే చేస్తారు. తన ఓటు తనకు కల్పించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం కాస్త అన్ని నియోజకవర్గాలకి పాకి చివరకు లక్షలాదిమంది తమ ఓటు ఎవరో వేశారని ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయాల్సిన కొత్త ప్రభుత్వం కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోతుంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకరకంగా అటువంటి పరిస్థితి ఇప్పుడు…

Read More

యుద్ధభూమిలో భారత్ ప్రచండ శక్తి – ప్రపంచంలో నాలుగో స్థానం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లతో దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్‌పవర్ 2025 నివేదిక ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తి కలిగిన దేశాల వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను చాటుకుంది. ఈ నివేదిక ప్రకారం అగ్రగామి దేశాల సైనిక బలం, రక్షణ బడ్జెట్‌లు, ఆధునిక ఆయుధాల వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి….

Read More