ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపీ కలిశెట్టి అభినందన

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వారు రాధాకృష్ణన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకం మాత్రమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తమ మద్దతును తెలియజేసేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు…

Read More

ఉత్తరాధిపత్యంపై ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు

సహనం వందే, హైదరాబాద్:దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాధిపత్యం ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంటుంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో మార్వాడీ గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో…

Read More

డ్రాగన్ ‘గోల్డ్’ రష్… డాలర్ ఫినిష్ – చైనా బంగారం వేట!

సహనం వందే, చైనా:అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ ఇప్పుడు బితుకు బితుకుమంటూ కాలం వెళ్లదీస్తుంది. అలాగే ఒకనాడు సోవియట్ రష్యా అమెరికాతో ఢీ అంటే ఢీ అన్నట్లు శాసించి కనుమరుగైపోయింది. అలాగే అమెరికా కూడా ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని డ్రాగన్ కంట్రీ చైనా కలలు కంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ…

Read More

అబార్షన్ల మాఫియా – తుంగతుర్తిలో నకిలీ వైద్యుడి దందా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలోని తుంగతుర్తిలో నకిలీ వైద్యుడి చేతిలో ఒక గర్భిణీ మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తెలంగాణ వైద్య మండలి సుమోటోగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా నకిలీ వైద్యుడు శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కేవలం చికిత్స మాత్రమే కాదు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చికిత్స పేరుతో ప్రాణం తీశాడు…తుంగతుర్తిలో నకిలీ వైద్యుడు/ఆర్ఎంపీ శ్రీనివాస్ చేసిన…

Read More

బీహార్ లో రాహుల్ ‘వార్’ – నేటి నుంచి ఓటర్ అధికార్ యాత్ర

సహనం వందే, పాట్నా:రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఎన్నికల కమిషన్ కు చుక్కలు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాలో నెలకొన్న తప్పులను ఎండగడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను పరిరక్షించేందుకు ఆయన యుద్ధమే చేస్తున్నారు. వార్-1లో ఢిల్లీ కేంద్రంగా తన ప్రతాపం చూపగా… వార్-2లో క్షేత్రస్థాయిలో బీహార్ కేంద్రంగా యుద్ధం ప్రకటించారు. ఆదివారం నుంచి ఆ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు 1300…

Read More

‘పదవులు మీకే… పైసలు మీకేనా’ – రేవంత్‌ రెడ్డి పై రగులుతున్న కోమటిరెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీని విస్మరించడం, నియోజకవర్గానికి నిధులు రాకపోవడంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనతో మాట్లాడాలని నిర్ణయించినప్పటికీ, రాజగోపాల్‌రెడ్డి తన దండయాత్రను ఆపడం లేదు. మంత్రి పదవి వివాదం.. విభేదాలకు కారణంరాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే…

Read More

బెంగాల్ ‘టైగర్’తో ‘అగ్ని’హోత్రి – ‘బెంగాల్ ఫైల్స్’ కు సీఎం మమత ఝలక్

సహనం వందే, కోల్‌కతా:ప్రముఖ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కోల్‌కతాలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. తన తాజా చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడి పోలీసులు, థియేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బెంగాల్ ముఖ్యమంత్రి టైగర్ మమతతో పెట్టుకోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. అగ్నిహోత్రి తన సినిమాలతో అగ్గి రాజేయడం అలవాటే కాబట్టి, బెంగాల్‌లో కూడా అదే జరుగుతుందని ఊహించవచ్చు. వివాదాస్పద సినిమాలు…వివేక్ అగ్నిహోత్రి గతంలో కశ్మీర్…

Read More

సరోగసి కేసులో 7 ఆస్పత్రులకు నోటీసులు

సహనం వందే, హైదరాబాద్:మేడ్చల్‌ సరోగసి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఏడు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డి పలు ఆస్పత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. సరోగసి ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు అనుమానిస్తున్న హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య…

Read More

ధర్మస్థల సమాధుల్లో ఘోషిస్తున్న ఆత్మలు – 90 శాతం మంది మహిళలు…

సహనం వందే, బెంగళూరు:సహజంగా ధర్మస్థల అనే పదం ఎంతో సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారణకాండకు పర్యాయపదంగా గోచరిస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక సమాధుల కేసు అంతర్జాతీయంగానే పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు. ఆలయ ఆదేశాలతో వందలాది సమాధులు…తాను, తన బృందం…

Read More

రాపిడో ‘ఓన్లీ’ ఫుడ్ డెలివరీ – స్విగ్గీ, జొమాటోలకు సరికొత్త సవాల్

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో రైడ్-హెయిలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి దూసుకువచ్చింది. ‘ఓన్లీ’ (Ownly) అనే కొత్త యాప్‌తో స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ యాప్ సరసమైన ధరల్లో భోజనం అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో ఈ కొత్త అడుగుతో భారతీయ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుంది. తక్కువ ధరలో రుచికరమైన భోజనం…రాపిడో…

Read More