బెట్టింగ్ యాప్‌లపై సిట్

   అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి – బెట్టింగ్ యాప్ లు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు – ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు – విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సహనం వందే, హైదరాబాద్ తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శాసనసభ, మండలిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని ఆయన…

Read More

రెండు భాషలు చాలు: స్టాలిన్

– తమిళనాడులో తమిళం, ఇంగ్లీషే అధికార భాషలని స్పష్టీకరణ సహనం వందే, చెన్నై: “తమిళనాడుకు రెండు భాషలే చాలు” అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండించిన ఆయన, తమ రాష్ట్రం ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తమిళ సంస్కృతి, భాషా హక్కులను కాపాడేందుకు త్వరలో కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. ద్విభాషా విధానమే కొనసాగుతుంది… శాసనసభలో భాషా విధానంపై జరిగిన చర్చలో స్టాలిన్…

Read More

అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే

– మహిళల ‘ఛాతీని పట్టుకోవడం రేప్ కాద’న్న తీర్పు అమానవీయమంటూ వ్యాఖ్య సహనం వందే, ఢిల్లీ: మహిళల ఛాతీని పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “నాలుగు నెలలు ఆలోచించి వెలువరించిన…

Read More

జస్టిస్ వర్మ తీర్పులపై అనుమానాలు

– న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సవాల్ – కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో తీర్పు వర్మదే సహనం వందే, ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు లభ్యం కావడం, ఆయన గత తీర్పులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో నూతన సందేహాలను రేకెత్తిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు ఇప్పటికే వర్మ తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, దేశవ్యాప్తంగా మరిన్ని కీలక కేసుల…

Read More

బీజేపీ ‘ఇఫ్తార్ దౌత్యం’

  ‘సౌగాత్-ఈ-మోదీ’తో కొత్త ఎత్తుగడ – బీహార్ ఎన్నికల వేళ ముస్లిం ఓటర్లపై వల – 32 లక్షల మందికి ఇఫ్తార్ కిట్లు పంపిణీ సహనం వందే, ఢిల్లీ: పొద్దున్నే లేస్తే ముస్లింలను పనిగట్టుకుని విమర్శించే బీజేపీ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడకు తెరలేపింది. ముస్లింలకు దూరంగా ఉండే ఆ పార్టీ ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు రంజాన్ సమయంలో ముస్లింలకు ప్రత్యేక వసతులు కల్పించడం పైన, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చిపోయే వేళల్లో ప్రత్యేక…

Read More

హైదరాబాద్‌లో ఇళ్ల క్రమబద్దీకరణ కుంభకోణం

   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58 పేరుతో వందల కోట్ల దోపిడీ – పేదల ఆశలను అమ్ముకున్న రెవెన్యూ అధికారులు, దళారులు – రెండేళ్లు కావస్తున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్న మోసగాళ్లు – వేల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట దోపిడి… రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట జీవో నెంబర్ 58ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు రెవెన్యూ అధికారులు,…

Read More

యువకుడిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్

   మేడ్చల్ లో రైలు కిందపడి ఆత్మహత్య – సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు… – 19 కంపెనీలపై కేసులు… కోర్టులో సవాల్ సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌ అనే పిశాచం యువత జీవితాలను బలితీసుకుంటోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ (24), రూ. 2 లక్షలు కోల్పోయి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో చివరి కాల్‌లో తన తీవ్ర ఒత్తిడిని బయటపెట్టి, రైలు ట్రాక్ వద్ద లొకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు…

Read More

కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన పోలీసు దాడికి నిరసనగా ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. కెమెరాలను కింద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ విద్యార్థి కిందపడిపోయిన సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయారు. ఇదంతా గమనించిన ఓ పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించాడు. వెంటనే…

Read More

ఎంపీల జీతాల దోపిడీ

పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంపు – 475 మంది ఎంపీలు కోటీశ్వరులు… – ఎంపీల సగటు ఆస్తి రూ. 20 కోట్లు… పెంపుపై మండిపడుతున్న జనం – హెటెరో అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు – మరో పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తి రూ. 2,577 కోట్లు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అలా కోట్లకు…

Read More

మార్క్ ఫెడ్ లో ప్రజాధనం లూటీ

రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం – రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే – ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్ – కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్ సహనం వందే, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్‌ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24…

Read More