‘లక్ష’ల్లో ఆశ… ‘వంద’తో నిరాశ – భారత్ లో మస్క్ టెస్లా ఆశలు మటాష్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్‌లో టెస్లా వాహనాల విక్రయాలు చూస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. టెస్లాను భారత్‌కు తీసుకొస్తే లక్షల్లో కార్లు అమ్ముడవుతాయని ఎలాన్ మస్క్ పెట్టుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. అక్టోబర్‌లో టెస్లా అమ్మింది కేవలం 40 వాహనాలు మాత్రమే! సెప్టెంబర్‌లో అమ్ముడైన 64 వాహనాలతో పోలిస్తే ఇది ఏకంగా 37% పతనం. జూలై నుంచి ఇప్పటివరకు అమ్మిన మొత్తం కార్లు 144 మాత్రమే. కొన్ని వందల ఆర్డర్లతో టెస్లా చేస్తున్న ఈ మౌన ప్రదర్శన చూస్తుంటే దేశీయ…

Read More

అర లక్ష కోట్లకు హైడ్రా రక్షణ – కమిషనర్ రంగనాథ్ వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడడంలో హైడ్రా సాధించిన విజయం అసాధారణమైనది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఏకంగా 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 1045.12 ఎకరాల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ. 50,000 కోట్ల నుండి రూ. 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు,…

Read More

బీహార్ ఎన్నికల్లో అమ్మాయిల ఎర – ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ లీక్స్

సహనం వందే, పాట్నా:ఒకవైపు బీహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు తెరవెనుక కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న దారుణాలు దేశాన్ని కుదిపేశాయి! ఎన్నికల సమయంలో లాబీయింగ్ కోసం… పెద్ద పెద్ద నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అమ్మాయిలను సరఫరా చేయడం నివ్వెరపరిచింది. ప్రముఖ జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ బయటపెట్టిన రహస్యాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు తమ విలాసాల కోసం ఏకంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారట!…

Read More

జైలు పాలవుతున్న జస్టిస్ – నేరం నిరూపితం కాకుంటే జైల్లోనే జీవితం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ న్యాయం కళ్ల గంతలు కట్టుకుని ఉందంటే బహుశా ఇదేనేమో! దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన మాటలు ఇవి. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ స్వయంగా విడుదల చేసిన నివేదిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. మన జైళ్లలో మగ్గుతున్న మొత్తం ఖైదీల్లో 70 శాతం మందికి పైగా ఇంకా అండర్‌ట్రయల్స్‌ (నేరం రుజువు కానివారు) కావడం వ్యవస్థకు అద్దం పడుతోంది. ఎంతోమంది పౌరులు దోషులుగా తేలకముందే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటే న్యాయం…

Read More

లీవ్ అడిగితే లెక్చర్- ఆఫీసుల్లో బాసుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఒక రెడిట్ పోస్ట్ ఇప్పుడు భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో అగ్గి రాజేసింది. అత్యవసరం అని లీవ్ అడిగితే… జపాన్ మేనేజర్ ఆప్యాయంగా పలకరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అంటూ ప్రేమగా సెలవు మంజూరు చేశాడు. కానీ మన భారతీయ బాస్ ఎలా స్పందించారో తెలుసా? ‘నువ్వు ఎక్కువగా సెలవులు పెడుతున్నావు. నీ పని తీరుపై మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. సరేలే కానీ ఈసారికి సెలవు ఆమోదించాను… అయితే ఫోన్లో, మెయిల్‌లో అందుబాటులో ఉండు’ అని…

Read More

ఆకలిపై షాట్… షుగర్ ఔట్ – బరువుపై అమెరికా ఫార్మా కంపెనీ బ్రహ్మాస్తం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్‌లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్…

Read More

క్రికెట్ క్వీన్స్… నేషన్ రన్స్ – ప్రపంచ కప్ తో పెరిగిన మహిళా క్రికెట్‌ క్రేజ్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం ఒక స్ఫూర్తి తరంగం. ఈ నెల మొదటి వారంలో మహిళా జట్టు కప్పు కొట్టిన క్షణం దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలను మైదానాల్లోకి పరిగెత్తించింది. గత కొన్నేళ్లుగా ఆడవాళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపు అవుతోంది. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ఎక్కడ చూసినా బ్యాట్ పట్టిన ఆడపిల్లలే కనిపిస్తున్నారు. ఈ క్రీడా విప్లవం…

Read More

దళిత్ రాక్స్… బీహార్ షేక్స్! – బీ’హోర్’లో ఓటింగ్ సునామీ!

సహనం వందే, పాట్నా:మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీహారులో పల్లెల నుంచి పట్నాల వరకు ఒక అద్భుతం జరిగింది. ఏడు దశాబ్దాల బీహార్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం చివరి బ్యాలెట్ పడే సమయానికి మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక శాతం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని 2020 పోలింగ్‌తో పోల్చి చూసినప్పుడు… మొదటి…

Read More

‘నంబర్ వన్‌’ భ్రమ – నెంబర్ కేవలం సమాజం సృష్టించినదే

సహనం వందే, హైదరాబాద్:ప్రతిచోటా నంబర్ వన్‌ గా ఉండాలి. ఉద్యోగంలో టాప్ ప్లేస్‌లో… ఇంట్లో అప్యాయమైన తల్లిగా… భార్యగా… ఇలా అన్ని పాత్రల్లో నూటికి నూరు శాతం అద్భుతంగా ఉండాలనే లక్షణం ఈ తరం మహిళలకు పెద్ద భారంగా మారింది. ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరి చివరికి ఏం చేస్తుందో తెలుసా? రచయిత్రి అమండా గోయెట్జ్ జీవితంలో జరిగిన విషాదమే ఉదాహరణ. అన్నింటా సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని పరుగులు తీసిన ఆమె… ఒక రోజు తీవ్రమైన…

Read More

రక్తం కోరిన రాజ్యం – సుడాన్‌ను గడగడలాడిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్

సహనం వందే, సుడాన్:సుడాన్‌ను గడగడలాడిస్తున్న పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) క్రూరత్వం మరోసారి ప్రపంచానికి బహిర్గతమైంది. గత నెలలో ఎల్‌-ఫాషర్ నగరంలో జరిగిన భయంకరమైన మారణకాండ వివరాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ దాడిలో 2 వేల మందికి పైగా పౌరులు చనిపోయి ఉండవచ్చని అంచనా. ‘చూడండి… ఇదే మా పని… ఇదే జెనోసైడ్’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు తొమ్మిది శవాల పక్కనుంచి వెళ్తూ ఉల్లాసంగా నవ్వుతూ వీడియోలు తీయడం వారి కర్కశత్వానికి పరాకాష్ట. యుద్ధ…

Read More