డాక్టర్ రఘురామ్ కు అంతర్జాతీయ గౌరవం – రాయల్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నిక
సహనం వందే, హైదరాబాద్: దేశ వైద్య రంగానికి దక్కిన చారిత్రక గౌరవం ఇది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో గవర్నింగ్ కౌన్సిల్‌కు భారతదేశం నుంచి ఎన్నికైన తొలి శస్త్రవైద్యుడిగా డాక్టర్ రఘురామ్ ఘనత సాధించారు. కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్ రఘురామ్…