దానం ముసుగులో దగా

సహనం వందే, హైదరాబాద్: ‘ఒక బిలియనీర్ దానం చేస్తున్నాడంటే, కమ్యూనిజం మీ బుర్రకెక్కలేదని అర్థం’- కారల్ మార్క్స్ అన్న ఈ మాటలు నేటి బిలియనీర్ల దానాల వెనుక దాగి ఉన్న నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు తమ సంపదలో కొంత భాగాన్ని దానం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మార్క్స్ దృష్టితో చూస్తే ఈ దానాల వెనుక స్వచ్ఛమైన ఉద్దేశాలు కాకుండా, తమ సామ్రాజ్యాలను కాపాడుకునే కుట్రలు, పన్నులు ఎగ్గొట్టే దిక్కుమాలిన ఎత్తుగడలు…

Read More

…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ…

Read More

జడ్జి ఆదర్శం… నేతల ధిక్కారం

సహనం వందే, హైదరాబాద్: వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదర్శవంతంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు మంత్రి చెప్పారు. కానీ గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అంతంత మాత్రంగానే సేవలు ఇస్తుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

‘నకిలీ’ల చేతిలో ప్రాణాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, అనధికార ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా మారి, నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు, ఆసుపత్రులు నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో ఇటీవల జరిగిన తనిఖీలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దందా ఇంకా కొనసాగుతుండటం ఆందోళన…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More

ఐయ్యా’ఎస్’… నీ కాల్మొక్తా!

సహనం వందే, హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి, తమ గౌరవాన్ని తామే పణంగా పెడుతున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సర్వీసులు ప్రజాసేవ కోసం ఉద్దేశించినప్పటికీ, కొందరు అధికారులు మంచి పదవులు, అక్రమ లాభాల కోసం రాజకీయ నాయకులకు దాస్యం చేస్తూ, బ్యూరోక్రసీకి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా తెలంగాణలోని అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కిన ఘటన ఈ అనైతిక…

Read More

తమన్నాకు కన్నడిగుల షాక్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్ సహనం వందే, మైసూర్: ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియాను నియమించడం కర్ణాటకలో పెను దుమారం రేపుతోంది. రెండేళ్ల కాలానికి ఏకంగా రూ. 6.2 కోట్ల భారీ మొత్తంతో కుదిరిన ఈ ఒప్పందంపై కన్నడిగులు మండిపడుతున్నారు. స్థానిక నటులను పక్కనపెట్టి, బయటివారిని ఎంపిక చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక…

Read More

రాగి బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు!

సహనం వందే, హైదరాబాద్: కాపర్ (రాగి) బాటిళ్లు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, అతిగా రాగిని తీసుకోవడం వల్ల ‘కాపర్ టాక్సిసిటీ’ సమస్య తలెత్తుతుంది. ఇది కిడ్నీలు, లివర్‌కు తీవ్రమైన హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు రాగి బాటిళ్లను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం… రాగి మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది…

Read More

ఎవడైతే నాకేంటి?

సహనం వందే, హైదరాబాద్: ఆయన రాష్ట్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి. జిల్లా వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. ఆ అధికారికి నోటి దురుసు ఎక్కువ. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు వైద్యాధికారులు హైదరాబాదులోని ఆ కీలక అధికారిని కలిశారు. తమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వైఖరితో విసిగిపోయామని, ఆయన్ను తొలగించాలని… అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంగీకారం తెలుపుతూ లేఖ రాశారని తమ బాస్ కు…

Read More