‘స్ట్రీట్‌ డాక్టర్స్’

సహనం వందే, హైదరాబాద్: ఈమె పేరు మిల్లీ-మే ఆడమ్స్. యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ కు చెందిన మెడికల్ స్టూడెంట్. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. బ్రిటన్ లో అందాల పోటీల్లో ఆమె గతంలో విజయం సాధించారు. ఈ యువ డాక్టర్ అందాల పోటీలోనే కాదు… ఒక మెడికోగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్ట్రీట్ డాక్టర్స్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 2008లో వైద్య విద్యార్థులతో ప్రారంభమైన…

Read More

ఆసుపత్రుల్లో కరెంట్ కష్టాలు

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు రోగుల పాలిట శాపంగా మారాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరెంటు కోతతో వైద్యులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ల సాయంతో రోగులకు చికిత్స అందించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ స్పందించి, ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అయితే,…

Read More

‘హార్వర్డ్’లో కమ్యూనిస్టులకు శిక్షణ

సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా అమెరికా విశ్వవిద్యాలయాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి చెందిన ఉన్నత, మధ్య స్థాయి అధికారులకు పాలనా శిక్షణ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ అధ్యయనాలకు వేదికగా నిలిచాయి. అయితే ఈ సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలతో తెరదించనుంది. సీసీపీతో సంబంధాలు ఉన్న విద్యార్థులను అమెరికా విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించకుండా చేసేందుకు ట్రంప్ సర్కారు కొత్త విధానాన్ని అమలు చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కుమార్తె కూడా హార్వర్డ్‌లో రహస్యంగా…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై రైతుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ గళమెత్తింది. సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ శక్తులు, కొందరు అధికారులు ఆయిల్ ఫెడ్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం తమ…

Read More

ఆయిల్ ఫెడ్ లో ‘సిద్ధిపేట’ కుంభకోణం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు ఆకాశాన్ని అంటాయి. అందులో పని చేసే కీలక అధికారులే దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో పనిచేసిన ఒక ఎండీ ఈ అక్రమాలకు తెర లేపగా… దాన్ని ప్రస్తుతం ఒక మేనేజర్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రూ. 100 కోట్లకు పైగా మెక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు ఆయిల్ ఫెడ్ ను నట్టేట ముంచేశారు. వారి దుర్బుద్ధి కారణంగా ఆయిల్…

Read More

మెడికోలపై ‘ప్రైవేట్’ల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: వైద్య విద్యార్థులపై ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు అంతే లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూల్ చేయడం… విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను కాజేయడం… ఇదేంటని ప్రశ్నిస్తే ‘మీ జీవితం మా చేతుల్లో ఉందం’టూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైద్య విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్న వైనం, వారిని వేధిస్తున్న తీరుపై తెలంగాణ అడ్మిషన్, ఫీజు…

Read More

అందం వెనుక విషాదం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం. 16 ఏళ్లలోనే జీవిత పాఠం…2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని…

Read More

బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు…

Read More

నీళ్లు లేని ఫైరింజన్లు

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్‌లో 18న ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య విభాగాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబీకులను కోల్పోయామని ఆవేదనతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సన్నద్ధత లేమి ఈ విషాదానికి ప్రధాన…

Read More

మిక్సోపథీ ప్రజారోగ్యానికి పెను ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మిక్సోపథీ విధానం ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) విమర్శించింది. వైద్య విద్యను శాస్త్రీయత నుండి వేరుచేసే ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జూడా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూడా అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, ఆధునిక వైద్యం శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా ఏర్పడిన ఘనమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు….

Read More