వ్యాపార సామ్రాజ్యానికి 100 మంది కొడుకులు – సరోగసి పద్ధతిలో కంటున్న బిలియనీర్లు
సహనం వందే, హైదరాబాద్: చైనా కుబేరులు ఇప్పుడు కేవలం ఆస్తులు పెంచుకోవడమే కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అడ్డదారుల్లో వంశ విస్తరణకు తెరలేపారు. చైనాలో సరోగసీ (అద్దె గర్భం)పై నిషేధం ఉండటంతో వీరు తెలివిగా అమెరికా చట్టాలను వాడుకుంటున్నారు. వీడియో గేమ్స్ కంపెనీ అధిపతి జూ బో దీనికి తాజా ఉదాహరణ. ఏకంగా 100 మందికి పైగా పిల్లలను కనడం కేవలం కుటుంబ ప్రణాళిక కాదు… ఇదొక భారీ వ్యాపార వ్యూహం. అమెరికాలో పుట్టిన…