జగన్ దారి తేజస్వి బికారి – ఆంధ్రప్రదేశ్ వైసీపీ పరిస్థితి బీహార్ లో రిపీట్

సహనం వందే, పాట్నా:రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. అభిమానం పీక్స్ కు చేరితే ఎన్నికల ఫలితం ‘వార్ వన్ సైడ్’ వలే మారిపోతుంది. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తగిలిన గట్టి షాక్‌ ఇప్పుడు బీహార్‌లో రిపీట్ అయ్యింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్… ఎన్డీఏ కూటమి ధాటికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సరిగ్గా అలాంటి తీర్పు ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని…

Read More

అమెజాన్ అడవి బిడ్డల గోడు – ఐరాస సదస్సులో ఆదివాసీల రచ్చ

సహనం వందే, బ్రెజిల్:బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్30) ఈసారి ఆదివాసీల ఆందోళనలతో వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో వేలాది మంది ఆదివాసీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆండిస్, అమెజాన్ అడవి ప్రాంతాల నుంచి నెల రోజుల పాటు యకు మామా (నీటి తల్లి) పేరుతో సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన ఈ అడవి బిడ్డలు తమ అరణ్యాలు బంగారు మైనింగ్, చమురు తవ్వకాలతో నాశనం అవుతున్నా ప్రపంచ దేశాలు మొసలి…

Read More

బీహార్ ఫలితాలపై ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనం

సహనం వందే, అమెరికా:బీహార్ ఫలితాలపై ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్ న్యూస్ పేపర్ ‘న్యూయార్క్ టైమ్స్‘ శుక్రవారం సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీకి… ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు రావడంపై ‘న్యూయార్క్ టైమ్స్’ విమర్శనాత్మకంగా విశ్లేషించింది. ఆ కథనం సారాంశ ఏమిటో పరిశీలిద్దాం. (న్యూయార్క్ టైమ్స్ రాసిన స్టోరీ ఇక్కడున్న లింకులో  https://nyti.ms/4r7fC5J చూడొచ్చు) భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పాలక కూటమి…

Read More

‘ఐఐటీ’యన్ కోసం కదిలొచ్చిన గూగుల్ – గంటలో పాస్ పోర్ట్.. ప్రైవేట్ జెట్లో అమెరికాకు

సహనం వందే, పాట్నా:సాధారణంగా విద్యార్థులు ఇంటర్నెట్‌లో కాలక్షేపం చేస్తారు. కానీ బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ఇందుకు భిన్నం. ఐఐటీ మణిపూర్‌లో చదువుతున్న ఈ యువకుడు… ఏకంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ పైనే దృష్టి పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే! తన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 53 సెకన్ల పాటు గూగుల్‌ను స్తంభింపజేసి… ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎక్కడికక్కడ కూర్చున్న గూగుల్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా ఈ అనూహ్యమైన హ్యాక్‌కు కారణం…

Read More

ఏఐ మోజు… లైఫ్ క్లోజ్ – యూజర్ డేటా దోపిడీ!

సహనం వందే, అమెరికా:తమ కొత్త ఏఐ సాధనం జెమినిని అడ్డుపెట్టుకుని యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను, రహస్య సంభాషణలను గుట్టుగా దొంగిలిస్తోందంటూ అమెరికాలో గూగుల్ సంస్థపై దావా దాఖలైంది. మనం స్నేహితులతో షేర్ చేసుకునే ప్రతి చిన్న మాట… వ్యాపార రహస్యాలు దాగి ఉన్న ప్రతి ఈమెయిల్… పంపే ప్రతి ఫోటో… పత్రం… అన్నీ గూగుల్ నియంత్రణలో ఉన్న ఈ జెమిని ఏఐకి అందుబాటులోకి వెళ్లిపోవడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ప్రైవసీకి…

Read More

ధోనీ రీలోడింగ్… గంటలకొద్దీ ప్రాక్టీసింగ్ – ఐపీఎల్- 2026 కోసం కఠోరమైన శ్రమ

సహనం వందే, రాంచీ:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్- 2026 కోసం కఠోర సాధనతో సిద్ధమవుతున్నాడు. 44 ఏళ్ల వయసులో కూడా యువ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో రోజుకు దాదాపు ఐదు గంటల పాటు చెమటోడుస్తున్నాడు. బైక్‌లపై తన ఇంటి నుంచి స్టేడియంకు చేరుకునే ధోనీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే తొలిసారిగా లీగ్…

Read More

‘నంబర్ వన్‌’ భ్రమ – నెంబర్ కేవలం సమాజం సృష్టించినదే

సహనం వందే, హైదరాబాద్:ప్రతిచోటా నంబర్ వన్‌ గా ఉండాలి. ఉద్యోగంలో టాప్ ప్లేస్‌లో… ఇంట్లో అప్యాయమైన తల్లిగా… భార్యగా… ఇలా అన్ని పాత్రల్లో నూటికి నూరు శాతం అద్భుతంగా ఉండాలనే లక్షణం ఈ తరం మహిళలకు పెద్ద భారంగా మారింది. ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరి చివరికి ఏం చేస్తుందో తెలుసా? రచయిత్రి అమండా గోయెట్జ్ జీవితంలో జరిగిన విషాదమే ఉదాహరణ. అన్నింటా సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని పరుగులు తీసిన ఆమె… ఒక రోజు తీవ్రమైన…

Read More

76/180 – వందే భారత్‌ వేగం వీక్… ప్రయాణీకుల చిరాక్

సహనం వందే, హైదరాబాద్:భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశ సాంకేతిక సామర్థ్యానికి అద్దం పట్టాలని ఆశించినా ఆచరణలో నిరాశే మిగిలింది. గంటకు 180 కిలోమీటర్లు దూసుకెళ్లాల్సిన ఈ అత్యాధునిక రైలు ప్రస్తుతం కేవలం 76 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుస్తోంది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. విమాన ప్రయాణ అనుభూతిని ఇస్తుందన్న ప్రచారం కేవలం ఊహగానే మిగిలిపోయింది. ఈ రైలు వేగం తగ్గడానికి కారణం ఆ రైలు సామర్థ్య లోపం కాదు… దశాబ్దాల…

Read More

వన్‌ప్లస్ రాక్… ఐఫోన్‌కు షాక్ – నేడు డ్రాగన్ కంట్రీలో వన్‌ప్లస్15 విడుదల

సహనం వందే, హైదరాబాద్:స్మార్ట్‌ఫోన్ల రణరంగంలో వన్‌ప్లస్ మరోసారి యుద్ధానికి సిద్ధమైంది. సోమవారం (నేడు) చైనాలో వన్‌ప్లస్ 15 విడుదల కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో రూపొందిన ఈ ఫోన్ ఏకంగా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌తో ఢీ అంటే ఢీ అని పోటీపడటానికి రంగంలోకి దిగుతోంది. 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు, స్టైలిష్ డిజైన్‌తో భారత మార్కెట్‌ను షేక్ చేయడానికి ఈ ఫోన్ సిద్ధంగా ఉంది. టెక్ ప్రియుల గుండెల్లో…

Read More

సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – 225 స్టాఫ్ అసిస్టెంట్ల భర్తీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆరు జిల్లాల్లో ఉన్న ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలుఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అత్యధికంగా 99 ఖాళీలు ఉన్నాయి. కరీంనగర్‌లో 43, హైదరాబాద్‌లో 32 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మెదక్,…

Read More