అమెరికా వీసా… విద్యార్థుల దండయాత్ర – ట్రంప్ రూల్స్ ను బ్రేక్ చేసిన భారతీయులు
సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికాలో చదవడానికి మన విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ట్రంప్ కారణంగా వీసా కష్టాలు ఇబ్బంది పెడుతున్నా… నిబంధనలు మారుతున్నా మనవాళ్లు ఏమాత్రం వెనక్కి చూడడం లేదు. అమెరికాలో చదివి తీరాల్సిందేనన్న బలమైన ఆకాంక్షతో అక్కడికి వెళ్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏకంగా 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 9.5 శాతం ఎక్కువ. అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో…