దక్షిణాది వాటాపై మళ్లీ కుట్ర – కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం నివేదిక
సహనం వందే, హైదరాబాద్:16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగరియా తన నివేదికను గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీని ఈ నివేదిక నిర్ణయించనుంది. కీలకమైన ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయకుండా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిపై అప్పుడే తీవ్ర ఆందోళన మొదలైంది. కేంద్ర నిధుల పంపిణీ పాత పద్ధతిలోనే…