Sandeep Sandilya IPS

‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…

Read More
ED Rides on Medical Colleges

మెడికల్ కాలేజీలపై ఈడీ దెబ్బ- దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో దాడులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల సంఖ్య పెంపు కోసం ఎన్‌ఎంసీలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు కోట్లకు కోట్లు లంచం తీసుకున్నారన్న అనుమానంతో గురువారం ఈడీ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద వైద్య విద్యా సామ్రాజ్యాలు ఈ దాడుల్లో చిక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌మనీ…

Read More
Billionaires Leaves India

దేశం విడిచిపోతున్న ధనలక్ష్మి – విదేశాలకు వెళ్లిపోతున్న బిలియనీర్లు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు…

Read More
Chennai-Based Visa Scam Exposed

వీసమెత్తు పనికిరానివారికి వీసా – అమెరికాలో హైదరాబాద్ పరువు గంగపాలు

సహనం వందే, హైదరాబాద్/చెన్నై: అమెరికా వెళ్లేందుకు తీసుకునే వీసా ప్రక్రియలో భారీగా మోసాలు జరిగాయని ఒక దౌత్యవేత్త సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థలోని అక్రమాలను ఒక అమెరికన్-భారతీయ దౌత్యవేత్త మహ్వాష్ సిద్ధిఖీ బట్టబయలు చేశారు. వీసాల కోసం వచ్చే దరఖాస్తులలో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు నకిలీవి అని… ఈ వ్యవస్థ ఒక కుంభకోణంగా మారిందని మహ్వాష్ సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేనివారు, నకిలీ…

Read More
One Dollar reaches Rs.89.48

రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?

సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…

Read More
Uranium in Mothers' Milk in Bihar

తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు

సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….

Read More
IT Jobs Joru

ఐటీ జోరు… ఎంబీఏ బేజారు – ఇండియా స్కిల్స్ రిపోర్ట్ – 2026 వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: నిజం మాట్లాడుకుందాం! జాబ్‌ మార్కెట్‌లో ఇప్పటికీ డిమాండ్ అంటే అది కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిగ్రీలకే ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఏం చెబుతోందంటే… సీఎస్‌ గ్రాడ్యుయేట్లకు 80 శాతం, ఐటీ గ్రాడ్యుయేట్లకు 78 శాతం ఉద్యోగావకాశాలున్నాయి. అంటే నువ్వు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వైపు అడుగులేస్తే నీ కెరీర్‌కి ఢోకా లేనట్టే! కంపెనీలు ఇప్పుడు కోడింగ్‌కి పరిమితమయ్యే టాలెంట్‌ని కాదు… ఇంజినీరింగ్‌తో పాటు…

Read More
Dalit IAS Santosh Verma comments on Reservations

దళిత ఐఏఎస్ బ్రాహ్మణులకు సవాల్ – పెళ్లి పీటలెక్కేవరకు రిజర్వేషన్లు మస్ట్

సహనం వందే, భోపాల్: రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన…

Read More
Billionaires Brothers Nithin Chethan $570 Million Settlement by Supreme Court

వేల కోట్లు మోసం… కోర్టు అభయం – 13 వేల కోట్ల మోసకారులకు సుప్రీం బిగ్ ఆఫర్

సహనం వందే, న్యూఢిల్లీ: బ్యాంకులను ముంచిన బిలియనీర్ సోదరులు నితిన్, చేతన్ సందేసరాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. దాదాపు రూ. 13 వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో దేశం విడిచి పారిపోయిన నితిన్, చేతన్ ల పై సుప్రీంకోర్టు వేసిన బ్రేక్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వేల కోట్లు కొల్లగొట్టిన వారికి అత్యున్నత న్యాయస్థానం ఊరటనిస్తూ మొత్తం అప్పులో మూడో వంతు చెల్లిస్తే క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం…

Read More
Sisters/Women in Politics

వారసుడిదే పీఠం… ఆడబిడ్డ శోకం – రాజకీయ మంటల్లో ఆడకూతురు ఆగమాగం

సహనం వందే, హైదరాబాద్:రాజకీయ చదరంగంలో ఎప్పుడూ బలిపశువులు అయ్యేది ఆడబిడ్డ అనే చేదు నిజం మరోసారి బయటపడింది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయడమే కాదు అక్కడి అతిపెద్ద రాజకీయ కుటుంబమైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కూడా చిచ్చు రేపాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తే… ఆ ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి…

Read More