సివిల్స్‌లో మహిళా ‘శక్తి’

సహనం వందే, హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్‌తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్‌గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్‌ పరాగ్‌ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009…

Read More

సూపర్ స్టార్ మహేశ్‌బాబుపై ఈడీ కొరడా

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు తన స్టార్‌డమ్‌ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన…

Read More

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల!

మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని…

Read More

పదేళ్ల చిన్నారి మద్యంపై ఉద్యమం

సహనం వందే, ఆగ్రా: పదేళ్ల చిన్నారి ……. కానీ మనసు మాత్రం ఉక్కు సంకల్పం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో పదేళ్ల వంశిక సికర్వార్ అనే బాలిక చేసిన ఉద్యమం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన గ్రామంలోని మహిళలకు నిత్యం ఇబ్బంది కలిగిస్తున్న ఒక మద్యం దుకాణాన్ని తరలించేలా చేసి… నిజంగానే చిన్నారి పోరాట యోధురాలు అనిపించుకుంది. తాగొచ్చి గొడవ చేసేవారు..‌.కోలారా కలాన్ అనే చిన్న గ్రామంలో ఒక మద్యం దుకాణం ఉండేది. దాని వల్ల ఆ ఊరి మహిళలు…

Read More

జపాన్‌లో తెలంగాణ జాతర!

పెట్టుబడులకు రండి.. రేవంత్ రెడ్డి ఆహ్వానం! సహనం వందే, జపాన్ వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుండి మొట్టమొదట పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం…సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారుస్తున్నాయని రేవంత్…

Read More

ఐఐటీపై ఆరు’గురి’

సహనం వందే, కోట: ఒకే శిక్షణ కేంద్రంలో కలిసి చదివిన ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్-2025 పరీక్షలో అపూర్వ విజయాన్ని సాధించారు. రాజస్థాన్‌ కోట కేంద్రంగా వీరంతా సమిష్టిగా చదివి 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 24 మంది మాత్రమే సాధించిన 100 పర్సంటైల్‌లో ఈ ఆరుగురు ఉండటం విశేషం. ఈ ఆరుగురి స్నేహబంధం, పట్టుదల, అవిశ్రాంత కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఒకే చోట చదివి లక్ష్యాన్ని ఛేదించి…కోటకు చెందిన అర్ణవ్ సింగ్ (టాప్…

Read More

భార్య చేతిలో మాజీ డీజీపీ హత్య

సహనం వందే, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ పోలీసు బాస్, 1981 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ (68) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హృదయ విదారక ఘటన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఆయన స్వగృహంలో సంభవించింది. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం… ఆయన భార్య పల్లవి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. “నేనే రాక్షసుడిని చంపాను!”పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి…

Read More

అక్షయ తృతీయ… స్వర్ణ లక్ష్మి కటాక్షం

సహనం వందే, హైదరాబాద్: హిందూ పుణ్య సంప్రదాయంలో స్వర్ణాన్ని కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన సమయంగా విలసిల్లే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సంవత్సరంలో ఈ శుభ ఘడియలలో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి దివ్యమైన ముహూర్తాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ తేదీలలో కొనుగోలు చేయవచ్చు. ఈనెల 22, 24, 27, 29, 30 తేదీల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ పుణ్య తిథులలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఆర్థిక స్థిరత్వానికి, సిరిసంపదల వృద్ధికి శుభ సంకేతంగా…

Read More

పార్లమెంట్ భవనాన్ని మూసేయాలా?

సహనం వందే, ఢిల్లీ: సుప్రీంకోర్టుపైన, ప్రధాన న్యాయమూర్తి పైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటు ఎందుకని ఆయన మండిపడ్డారు‌. భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలని దుబే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి మతపరమైన యుద్ధాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి….

Read More

ఖమ్మంలో 10 ఆసుపత్రుల మూసివేత

సహనం వందే, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి నకిలీ బిల్లులు సమర్పించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం మూసివేశారు. చికిత్సలు చేయకుండానే నిధులు కాజేయడం ఆయా ఆసుపత్రుల అక్రమాలకు పరాకాష్ట. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులను పొందిన కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య…

Read More