sahanamvande@gmail.com

కాటేస్తున్న కాలేజీలు – రేప్ సంఘటనలతో దేశం ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, న్యూఢిల్లీ:వారం రోజుల క్రితం కోల్ కతాలో మెడికో పై అత్యాచారం… ఆ సంఘటన మరువకముందే బెంగళూరులో తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థినిపై క్యాంపస్ టాయిలెట్స్ లోనే అత్యాచారం చేసిన ఘటన నివ్వెర పరుస్తుంది. అంతకుముందు ఆరు నెలల క్రితం కోల్ కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో రేప్… హత్య జరిగింది. ఇలా కాలేజీ క్యాంపస్ లు అత్యాచారాలకు నిలయాలుగా మారడంపై దేశం యావత్తు ఉలిక్కిపడింది. ఇంత జరుగుతుంటే నిందితులు మాత్రం…

Read More

శ్రీలీలతో 150 కోట్ల యాడ్ – చైనీస్ బ్రాండ్ కు అట్లీ దర్శకత్వం

సహనం వందే, ముంబై:సాధారణంగా పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందడం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘చింగ్స్ దేశీ చైనీస్’ బ్రాండ్ కోసం ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ ప్రకటనను తెరకెక్కిస్తున్నారు. ఈ యాడ్‌ కోసం ఏకంగా సినిమా బడ్జెట్‌ను మించిన మొత్తాన్ని వెచ్చించడం విస్మయపరుస్తోంది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన ఆకర్షణ…

Read More

‘కృష్ణయ్య’ లీలలు… కాషాయ ‘రంగులు’ – అడ్డమేసిన పార్టీ ఎంపీనే బీసీలకు అండనా?

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ రాజకీయ విచిత్రాలకు నిలయంగా మారింది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని అందరికీ తెలిసినా… అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్. ‘కృష్ణయ్య’ ఈ బంద్‌కు ప్రధానంగా నాయకత్వం వహించడం హాస్యాస్పదం. ఆయనతోపాటు మరో బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతులు కలపడం… బీసీ బంధువుల్లోని శత్రువుల నాటకానికి అద్దం…

Read More

ఆడి కారు… సుమంత్ షికారు – ఏడాది క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా జీవితం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో సుమంత్ ఎదుగుదల అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వంలోని లొసుగులకు నిలువెత్తు సాక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు పద్ధతిపై చేరిన ఈయన… మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఏకంగా ఆమె కార్యాలయంలోనే ఓఎస్‌డీగా డిప్యూటేషన్‌పై చేరాడు. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఐఏఎస్ అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చే స్థితికి రావడం ఆయన చేతిలో మంత్రి కార్యాలయం మొత్తం బందీ అయిందనడానికి నిదర్శనం. అటవీ శాఖలో బదిలీలు, పదోన్నతుల్లో భారీగా లంచాలు వసూలు చేయడం,…

Read More

క్రిస్మస్ సెలబ్రేట్… దీపావళి రిగ్రెట్ – టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల తీరుపై ఆగ్రహం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ అతిపెద్ద ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులపై పండుగల వేళ ఒత్తిడి పెంచుతూ ఆధునిక బానిసత్వానికి పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో దీపావళి సెలవులు ఇచ్చేందుకు నిరాకరించడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సమయంలో టీమ్ సభ్యులందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సెలవులు మంజూరు చేసేది లేదని మేనేజర్ గ్రూప్ చాట్‌లో స్పష్టం చేసినట్లు ఒక టెక్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ ఒకలా… దీపావళి…

Read More

మంత్రిపైనే ముఖ్యమంత్రి ‘గన్’ – ఏకంగా సొంత మంత్రి ఇంటిపైనే పోలీస్ ఎటాక్

సహనం వందే, హైదరాబాద్:సహజంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో హల్చల్ చేయిస్తుంది. కానీ తెలంగాణలో సొంత మంత్రిపైనే పోలీసులతో అర్ధరాత్రి ఎటాక్ చేశారు. అది కూడా మహిళా మంత్రిపై ఈ దాడి జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ తుఫాన్ వీస్తోంది. సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రి ఇంటికి బుధవారం రాత్రి పొద్దుపోయాక టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది….

Read More

వీసా బజార్‌… ఇండియా లూజర్! – ప్రపంచంలో భారత పాస్‌పోర్ట్‌ పతనం

సహనం వందే, లండన్:అంతర్జాతీయ స్థాయిలో భారత పాస్‌పోర్ట్‌ విలువ భారీగా పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఏకంగా 85వ స్థానానికి దిగజారింది. గతంలో 77వ ర్యాంకు ఉండగా..‌. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడానికి అంతర్జాతీయ స్థాయిలో సరిహద్దు నిబంధనలే కారణమని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ కన్సల్టెన్సీ నివేదించింది. 2006లో 71వ స్థానంలో ఉన్న భారత్, 2015లో 88, 2021లో 90 వంటి అత్యంత కనిష్ట స్థాయులను చవిచూసి……

Read More

కర్ణాటకలో ‘గూగుల్’ గోల – బెంగళూరులో వైజా’గూగుల్’ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి:విశాఖపట్నంలో ‘గూగుల్’ ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బెంగళూరులో ఉన్న అత్యంత దారుణమైన రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు వ్యాపార వర్గాలను విసిగించాయని… అందుకే గూగుల్ సంస్థ విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిందని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే బెంగళూరు తన వ్యాపార సౌహార్ద్రతను కోల్పోయి అంతర్జాతీయ పోటీలో…

Read More

గూగుల్ డీల్… పవన్ ఫీల్ – పవర్ స్టార్ లేకుండానే అంతర్జాతీయ డీల్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం రాజుకుంది. రాష్ట్రానికి అతి కీలకమైన, దేశంలోనే ప్రథమమైన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం కోసం మంగళవారం ఢిల్లీలో జరిగిన భారీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం కూటమిలో విభేదాలను బహిర్గతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఈ చారిత్రక ఒప్పందానికి పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అనేక చిన్నపాటి ప్రభుత్వ…

Read More

జూబ్లీ’హీట్స్’ – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిరసన వెల్లువ

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు బందుకు కూడా పిలిపిచ్చాయి. మరోవైపు కుల సంఘాలు, నిరుద్యోగులు, వివిధ రకాలుగా నష్టపోయిన వర్గాలు వీరంతా కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్ వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు ఎలక్షన్ పోరు… మరోవైపు ప్రభుత్వంపై నిరసన వెల్లువలు…

Read More