
లండన్ మండెన్ – ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు
సహనం వందే, లండన్:లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా…