రీల్స్ మత్తు… మోడీ ఎత్తు – 21 శతాబ్దపు మత్తు పదార్థం ‘రీల్స్’
సహనం వందే, హైదరాబాద్:బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తన విమర్శల తూటాలను సంధించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ… దేశంలోని యువతను సామాజిక మాధ్యమాల ‘రీల్స్’ మత్తులో ముంచేసి ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు పట్టించుకోకుండా చేయాలని మోడీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ రీల్స్ మత్తు యువతను బానిసత్వం వైపు నెడుతోందని… ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో టెక్నాలజీని…