బహుజన హక్కుల బలిదానం – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చుక్కెదురు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బహుజన సమాజానికి విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి రంగాలలో సరైన అవకాశాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయన్న సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి బహుజనుల రాజ్యాంగ హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిణామం దేశంలోని…

Read More

బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు…

Read More

పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే…

Read More

ఢిల్లీతో రేవంత్ రె’ఢ్డీ’ – బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతోనే కొట్లాట

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు…

Read More

బీసీల నెత్తిన టోపీ – 42 శాతం రిజర్వేషన్లపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాలను రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు నాటకాలు ఆడుతూనే ఉన్నాయి. అగ్రవర్ణ పార్టీల నాయకులు బీసీల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తూనే ఉన్నాయి. అటువంటి వారిని కొందరు బీసీ నాయకులు నమ్ముతుండడం పరాకాష్ట. ఎక్కడైనా మేకలకు పులి రక్షణ ఇస్తుందా? అని బీసీ నేతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు…

Read More