
అందరివాడు… ఎవరూ లేనివాడు – చిరంజీవికి అండగా నిలవని తమ్ముళ్లు
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచే సరైన స్పందన కరువైంది. ముఖ్యంగా సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడంపై మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి అండగా నిలవాల్సిన సొంత తమ్ముళ్లు కూడా సైలెంట్‌గా ఉండటంతో……