విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్:విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు….

Read More

అగ్రికార్పొరేషన్లలో అవినీతి క్రీడ-కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

సహనం వందే, హైదరాబాద్: అన్నదాతలకు అన్ని విధాలా సాయం చేయాల్సిన వ్యవసాయ కార్పొరేషన్లు ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా మారాయి. అగ్రి కార్పొరేషన్లనన్నీ రైతుల ఆస్తులుగానే పరిగణించాలి… కానీ వాటిల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ సొంత జాగీరులా భావించటం సంస్థల స్ఫూర్తికే విరుద్ధం. ఆ సంస్థల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఉద్యోగులే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి సమగ్ర నివేదిక…

Read More

‘కుబేర’…. శేఖర్ కమ్ముల సృజనాత్మక విప్లవం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: కొందరు దర్శకులు తమ చిత్రాలతో ప్రేక్షకుల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని కలగజేస్తారు. వారి సినిమా విడుదలవుతోందంటే గుండె ధైర్యంతో థియేటర్లకు వెళ్ళిపోవచ్చు. సుదీర్ఘమైన పాతికేళ్ల సినీ ప్రస్థానంలో ఆయన కేవలం పట్టుమని పది చిత్రాలు మాత్రమే రూపొందించినప్పటికీ, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. నాలుగేళ్ళ విరామం తర్వాత, శేఖర్ కమ్ముల కుబేర చిత్రంతో వెండితెరపై తిరిగి మెరిశారు. మరి కుబేర ఎలాంటి అనుభవాన్ని అందించింది? నాగ్, ధనుష్ లాంటి స్టార్…

Read More

బేడీలపై వేడి – గద్వాల్‌లో రైతుల చేతికి సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్:రైతుల పట్ల పోలీసుల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. అనేక సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలకే అన్నదాతలకు సంకెళ్లు వేసి వారిని ఈడ్చుకొని వెళ్లడం దాష్టీకానికి పరాకాష్ట. తాజాగా జోగులాంబ గద్వాల్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి, నేరస్తుల్లా కోర్టుకు తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. ఈ సంఘటనపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ… జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావును నిలదీశారు. బేడీలు…

Read More

క్యాబినెట్ లో మెడికోలపై నివేదిక – మంత్రి దామోదర వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి, సిఫార్సులతో సహా చర్చించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశ ఫలితాలు, తదుపరి చర్యలను వివరించడానికి 25న టీ-జుడా ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జూడా నాయకులు డాక్టర్ ఐజాక్…

Read More

‘ఆ నూనె వాడితే ప్రాణాలేం పోవు’ – వ్యాపారి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక వినియోగదారుడికి ఎదురైన చేదు అనుభవం ఈ దారుణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ లో గారెలు చేసుకుని తినాలని ఆశగా నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన అతనికి, ఇంటికి వెళ్లాక చూసేసరికి ఆ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే ముగిసిందని తెలిసి…

Read More

గోమాతకు అండగా ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సమగ్ర అధ్యయనానికి ఆదేశం!పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి…

Read More

మెడికోలను బెదిరిస్తున్న యాజమాన్యాలు…

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేస్తున్న మెడికోలను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఇలా ధర్నాలు చేస్తే మీ డాక్టర్ డిగ్రీ ఎలా వస్తుందో చూడండని వార్నింగ్ ఇస్తున్నాయి. సోమవారం వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు స్టైఫెండ్ ఇవ్వాలని కోరారు. దీంతో కాలేజీ యాజమాన్యం చెందిన ప్రతినిధి ఒకరు వారి…

Read More

గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?

సహనం వందే, హైదరాబాద్:సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More