చంద్రబాబుతో రేవంత్ రె’డ్ఢీ’ – వరద జలాలపై ఆంధ్రప్రదేశ్ వాదన

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వరద…

Read More

ఆయిల్ పామ్ కంపెనీలకు విత్తన ‘చుట్టం’

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంటను ప్రోత్సహించాలని ప్రయత్నాలు చేస్తున్నా… ఆ మేరకు రైతులకు భరోసా కల్పించే విషయంలో ఆయిల్ ఫెడ్ అధికారులు విఫలం అవుతున్నారు. ఇతర పంటలకు బదులు లక్షలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని చెబుతూనే… మరోవైపు ఆ పంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ పంటకు నష్టం జరిగితే పరిహారం ఉంటుందా? అన్న రైతుల…

Read More

యూరియా సకాలంలో సరఫరా చేయాలి – నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి

సహనం వందే, న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర రైతుల అవసరాల కోసం యూరియా సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను వివరించారు. రైతుల ఇబ్బందులపై దృష్టి…వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర…

Read More

10 గంటలు ‘మరణ’శాసనం – పని గంటలు పెంచిన కార్మిక ‘వ్యతిరేక’ శాఖ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పనివేళలను 8 గంటల నుండి 10 గంటలు కు పెంచుతూ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయంపై కార్మిక, ఉద్యోగ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త నిబంధన కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశ్రాంతితో కలుపుకుని ఏకంగా 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని జారీ చేసిన ఉత్తర్వులు కార్మికులను బానిసలుగా మార్చేస్తాయని…

Read More

ఆ రిపోర్టులోనే… ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల బాగోతం

సహనం వందే, హైదరాబాద్:ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి… ఆయిల్ ఫెడ్ కు కొద్ది నెలలపాటు ఎండీగా పనిచేశారు. ఆయన ఉన్న కొన్ని రోజుల్లోనే కార్పొరేషన్ ను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. అంతకు ముందు జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. అందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక తయారు చేయించారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా సురేందర్ పనిచేసిన కాలంలో చేపట్టిన కార్యక్రమాలు… అందులో జరిగిన అక్రమాలు ఈ రిపోర్టులో సమగ్రంగా పొందుపరిచారు. ఆ రిపోర్టు ప్రకారం కొందరిపై చర్యలకు…

Read More

తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు?

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు అనగాని, పార్థసారథి, నారాయణతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో కదిలిక వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ…

Read More

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులా? అడ్డమీది కూలీలా?

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక ప్రపంచంలో సమాన పనిచేసే ఉద్యోగుల వేతనాల మధ్య వివక్ష ఉండటం అనాగరికం. ఇది ఫ్యూడల్ వ్యవస్థ లక్షణానికి నిదర్శనం. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో సమాన పనికి – సమాన వేతనం అనే ప్రాథమిక సూత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు ఔట్‌సోర్సింగ్ విధానం పేరుతో తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి అన్యాయానికి పాల్పడితే ఆ…

Read More

వైద్య విద్యార్థులకు బానిస సంకెళ్లు…భవిష్యత్తు అతలాకుతలం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాఫియా కేంద్రాలుగా మారిపోయాయి. వాటి యాజమాన్యాలు అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా రాజకీయ నాయకులు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, రాజకీయం వంటి రంగాల్లో ఉన్నటువంటి ఈ పెద్దలు బ్లాక్ మనీతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు వైద్య విద్య వ్యాపారమే తప్ప… అది సేవకు అంకితమైన వృత్తిగా భావించడం లేదు. తక్కువ మౌలిక సదుపాయాలు కల్పించి… ఎక్కువ ఫీజులు వసూలు చేసి…

Read More

అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జర్నలిజంలో 16 ఏళ్ళకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో…

Read More

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మారణహోమంపై మౌనం

సహనం వందే, హైదరాబాద్:కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపితే… కేంద్ర ప్రభుత్వం ఏకంగా పాకిస్తాన్ తో యుద్ధమే చేసింది. అందుకు సహకరించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోన పడేసింది. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలంటే ఇలా చేయాల్సిందే. కానీ హైదరాబాదు శివారు పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏకంగా 43 మందికి పైగా చనిపోవడం… దాదాపు అంతే సంఖ్యలో గల్లంతు…

Read More