ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు
సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు….