కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు
సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…